Prakash Raj : చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ వైరల్ ట్వీట్.. పోలీస్ కేసు నమోదు..

ప్రకాష్ రాజ్ పై కర్ణాటకలోని బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. చంద్రయాన్-3 పై చేసిన ట్వీట్..

Prakash Raj : చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ వైరల్ ట్వీట్.. పోలీస్ కేసు నమోదు..

Police case filed on Prakash Raj regarding his tweet on Chandrayaan 3

Updated On : August 22, 2023 / 4:25 PM IST

Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. #justasking అంటూ ట్విట్టర్ చేసే పోస్టులు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా పొలిటికల్ సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేస్తుంటాడు. ఆ ట్వీట్స్ సంబంధిత రాజకీయ పార్టీ నేతలకు, అభిమానులకు కోపం తెప్పిస్తుంటాయి. కానీ ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ఒక ట్వీట్ పార్టీలతో సంబంధం లేకుండా చాలామందికి ఆగ్రహం కలిగించింది. భారతదేశం ఎంతో గర్వకారణంగా భావించే చంద్రయాన్-3 (Chandrayaan 3) పై ప్రకాష్ రాజ్ చేసిన ఒక ట్వీట్ అందరికి కోపం వచ్చేలా చేసింది.

Renu Desai : ఒక్క రోజులోనే పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన రేణూదేశాయ్.. అకీరా హీరో ఎంట్రీ లేనట్లేనా..?

ప్రకాశ్ రాజ్ ఒక ఫోటో షేర్ చేస్తూ.. “బ్రేకింగ్ న్యూస్ చంద్రుని నుండి #VikramLander పంపించిన మొదటి చిత్రం” అంటూ రాసుకొచ్చాడు. ఇక షేర్ చేసిన ఆ ఫోటో చాయ్ వాలాను పోలి ఉంది. దీంతో ప్రకాష్ రాజ్.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్లుగా నెటిజన్లు భావించారు. దీని పై నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ.. మీరు పొలిటికల్ గా ఒకర్ని టార్గెట్ చేస్తూ ఎన్ని విమర్శలు అన్న చేసుకోండి తప్పులేదు. కానీ ఇలా భారతీయ గర్వకారణం అయిన చంద్రయాన్-3 ని అడ్డుపెట్టుకొని విమర్శ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prakash Raj: చంద్రయాన్-3ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

అయితే ఈ పోస్ట్ పై ప్రకాష్ రాజ్ ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ నెటిజెన్స్ కి ఆ వివరణ నచ్చలేదు. ఇది ఇలా ఉంటే.. తాజాగా కొందరు హిందూ సంఘాల లీడర్స్ ప్రకాష్ రాజ్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ విషయంలో పోలీసులు వెంటనే అతని పై యాక్షన్ తీసుకోవాలంటూ కర్ణాటకలోని బెంగళూరులో కేసు నమోదు చేశారు. దీంతో ట్వీట్ విషయం మరికొంచెం సీరియస్ అయ్యింది. మరి ప్రకాష్ రాజ్ ఈ కేసు విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.