దిశా కేసు..ఎన్ కౌంటర్ : పోలీసులపై టాలీవుడ్ ప్రశంసలు

  • Published By: madhu ,Published On : December 6, 2019 / 04:24 AM IST
దిశా కేసు..ఎన్ కౌంటర్ : పోలీసులపై టాలీవుడ్ ప్రశంసలు

Updated On : December 6, 2019 / 4:24 AM IST

దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ కితాబిస్తున్నారు. జస్టిస్ ఫర్ దిశా అంటూ మొదటి నుంచి స్పందించిన టాలీవుడ్ నటులు సర్వత్రా హర్షం వ్యక్తం చేసింది. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దిశకు న్యాయం జరిగిందంటూ నటుడు నాగార్జున ట్వీట్ చేశారు.

దిశకు ఆత్మకు శాంతి చేకూరిందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించగా…దిశ కుటుంబసభ్యులకు న్యాయం జరిగిందని నటుడు మంచు మనోజ్ తెలిపారు. నిందితులను చంపిన బుల్లెట్లను దాచుకోవాలని ఉందన్నారు. రేపిస్టులకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని మంచు లక్ష్మీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి..వాడు పోలీసోడై ఉండాలని నటుడు నాని తెలిపారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు రకూల్ ప్రీత్ సింగ్. తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు నటి పూనం కౌర్. 
Read More : దిశా నిందితుల ఎన్ కౌంటర్ : జయహో తెలంగాణ పోలీస్..ప్రజల నినాదాలు
2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం షాద్ నగర్‌ చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఘటనాస్థలంలో నిందితులను (మహ్మద్‌, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్‌)లను విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి యత్నించారు. పోలీసులపైకి ముందుగా ఆరిఫ్ దాడికి యత్నించారు. జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు‌లు పోలీసులపైకి తిరగబడ్డారు.

ఆయుధాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. వీలు కాకపోవడంతో పోలీసులపై నిందితులు రాళ్లతో దాడి చేశారు. దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్ కౌంటర్‌లో ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. శుక్రవారం ఉదయం 3.30గంటల ప్రాంతంలో దిశను హత్య చేసిన ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.