Pooja Hegde: ఆ స్టార్ హీరోతో డేటింగ్ వార్తలపై పూజా హెగ్డే క్లారిటీ!

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో గతకొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Pooja Hegde: ఆ స్టార్ హీరోతో డేటింగ్ వార్తలపై పూజా హెగ్డే క్లారిటీ!

Pooja Hegde Denies Rumours Of Her Dating Salman Khan

Updated On : April 14, 2023 / 7:35 PM IST

Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ అన్ని భాషల్లోనూ బిజీగా ఉంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB28 చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, బాలీవుడ్‌లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా మారింది ఈ బ్యూటీ.

Pooja Hegde : అరేంజ్ డ్రెస్‌లో పూజా పరువాలు ఓరేంజ్..

అయితే గతకొంత కాలంగా పూజా హెగ్డే డేటింగ్ వార్తలపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో గతకొంత కాలంగా పూజా డేటింగ్‌లో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై పూజా, సల్మాన్ ఎవరూ రెస్పాండ్ కావడంతో ఈ వార్తల్లో ఖచ్చితంగా నిజం ఉంటుందని అందరూ అనుకున్నారు.

Pooja Hegde : ఆవారా సినిమాకి సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు లింగుసామి? బుట్టబొమ్మ హీరోయిన్?

కాగా, తన డేటింగ్ వార్తలపై తాజాగా స్పందించింది పూజా. సల్మాన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేదని చెప్పుకొచ్చింది. సల్మాన్ ఓ మంచి కో-ఆర్టిస్ట్ అని.. అతడితో మరిన్ని సినిమాలు చేయాలని తాను కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరి డేటింగ్ వార్తలపై పూజా క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికైనా ఆ వార్తలకు చెక్ పడుతుందా లేదా అనేది చూడాలి.