Prabhas – Rajamouli : ఈసారి అంతకు మించి..!
రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తోంది..

Prabhas Rajamouli
Prabhas – Rajamouli: ‘ఛత్రపతి’, ‘బాహుబలి – ది బిగినింగ్’, ‘బాహుబలి – ది కన్‌క్లూజన్’ సినిమాలు వచ్చాయి. ‘ఛత్రపతి’ ప్రభాస్‌కి మాస్ అండ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకి గౌరవం తీసుకురావడమే కాకుండా ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేసేశారు జక్కన్న..
Prabhas : ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా ఇస్తామంటున్నారు’.. అదీ ప్రభాస్ గొప్పదనం
ఇప్పుడు ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ – K’ వంటి పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసు పనిలో ఉన్నారు. దీని తర్వాత దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చెయ్యబోతున్నారు.
Filmy Facts : బాహుబలి2లో ప్రభాస్ డ్యామ్ ఎందుకు పగలకొట్టాడో తెలుసా..?
అయితే ప్రభాస్ – రాజమౌళి కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబోలో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సెట్ చెయ్యబోతుందని.. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రానటువంటి అద్భుతమైన సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.
Kangana Ranaut : పూరి – ప్రభాస్ ఒక్క ఛాన్స్ ప్లీజ్..!