Prabhas : ఇది నానమ్మ – మనవడి కథ.. 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నా.. ప్రభాస్ ఫుల్ స్పీచ్..
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.. (Prabhas)
Prabhas
Prabhas : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా ఈ సినిమా రానుంది. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Prabhas)
నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఫ్యాన్స్ మధ్య ఘనంగా జరిగింది.
Also See : స్టేజిపై ఏడ్చేసిన డైరెక్టర్ మారుతీ.. ఓదార్చిన ప్రభాస్.. వీడియో వైరల్..
Prabhas
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.. ఈవెంట్లో సుమ ఉంటే హ్యాపీగా అంటుంది. జోష్ ఇస్తుంది. డార్లింగ్స్ మీకు నచ్చిందని ఈ పిలక కూడా అవేసుకున్నాను. జపాన్ లో లవ్ సింబల్స్ అన్ని ఇచ్చాను. మీకు కూడా ఇస్తాను. చలిలో ఇబ్బంది పడుతున్నారు చూసుకోండి జాగ్రత్త. సంజయ్ దత్ సర్ క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు సీన్. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలు. ఈ సినిమాలో మా నానమ్మ బాగా చేసింది. డబ్బింగ్ లో ఆవిడ సీన్స్ చూసి నా సీన్స్ మర్చిపోయాను. మా నానమ్మ ఫ్యాన్ అయిపోయా. ఇది నానమ్మ – మనవడి కథ. హీరోయిన్స్ పాపం రెండున్నరేళ్లు కష్టపడ్డారు చాలా. నిధి అగర్వాల్ సెట్ లో అందరికి ఫేవరేట్.
నేను సరిగా మాట్లాడను అని అంటారు. ఏదో ఒకరోజు స్టేజిపై ఎంటర్టైన్ చేస్తాను షాక్ అయిపోతారు మీరు. అనుకున్న బడ్జెట్ ఒకటి అయిన బడ్జెట్ ఒకటి. అయినా మూడేళ్లు నిర్మాత విశ్వ గారు భయపడలేదు. ఈ సినిమాకు ఆయనే హీరో. ఈ లెవల్ RR థమన్ తప్ప ఎవడూ ఇవ్వలేడు ఇండియాలో అని అన్నాడు మారుతీ. థమన్ చూసి అతనిలా సూట్, బూట్ వేసుకొని రావాలనుకుంటా. నా కప్ బోర్డు లో రెండొందల బట్టలు ఉన్నాయి. కానీ వేసుకురావడానికి ధైర్యం చాలదు.
మారుతిని కలిసి ఈ మధ్య అన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాం, ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని అడిగాను. ఫైనల్లీ హారర్ కామెడీ సెట్ అయింది. సినిమా వెళ్తూనే ఉంది, రాస్తూనే ఉన్నారు. నేను మారుతీ గారి రైటింగ్ కి ఫ్యాన్ అయిపోయాను. ఇది ఒక కొత్త క్లైమాక్స్. హారర్ సినిమాలో హారర్ కాకుండా ఏదో కొత్తగా ట్రై చేసాడు మారుతీ. 15 ఏళ్ళ తర్వాత మారుతీ మనకు ఎంటరైన్మెంట్ ఇచ్చాడు. మీరే చూసుకోండి. సంక్రాంతి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి. సీనియర్స్ తర్వాతే మేము. ముందు వాళ్ళే. రేపు ట్రైలర్ వస్తుంది చూడండి అని అన్నాడు.
ప్రభాస్ స్ట్రాంగ్ గా 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాను ఇక మీరే చూసుకోండి అనడంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Prabhas : పిలకతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘స్పిరిట్’ లుక్ లో ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
