Kalki 2898 AD : 800 కోట్ల కల్కి.. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్..!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD.

Prabhas Kalki 2898 AD 9 days worldwide box office collection
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది.
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే కల్కి సినిమా బిజినెస్ రూ.370 కోట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గ్రాస్ రూ.800 కోట్ల అని చిత్ర బృందం తెలిపింది. అంటే ఈ లెక్కన ఇప్పటికే రూ.400 కోట్ల షేర్ వచ్చేసినట్లే. దీంతో చాలా చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను దాటినట్లే.
Ram Charan : ‘హనుమాన్’గా రామ్ చరణ్..? జై హనుమాన్ అప్డేట్.. హనుమాన్ నిర్మాత ఏం చెప్పారంటే?
ఇక నుంచి వచ్చే వసూళ్లు అన్ని కూడా లాభానేని అర్థమవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ప్రస్తుతం కల్కి వసూళ్లను చూస్తుంటే రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ వారంలోనూ పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం కల్కికి కలిసివచ్చే అంశం.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలు పోషించారు.
SS Rajamouli : రాజమౌళిపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
??? ??? ?????? ?? ???? ?#EpicBlockbusterKalki in cinemas – https://t.co/z9EmiReie8#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/MexQpSHlwI
— Kalki 2898 AD (@Kalki2898AD) July 6, 2024