SS Rajamouli : రాజమౌళిపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో రాజమౌళి జీవిత డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.

Netflix documentary on SS Rajamouli to premiere in August
దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి జీవిత డాక్యుమెంటరీ ఆగస్టు 2న విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో రాజమౌళి జీవిత డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరూన్, జో రుస్సో, కరణ్ జోహార్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్ లతో పాటు మరికొందరి గురించిన విశేషాలు ఉండనున్నాయని తెలుస్తోంది.
ఇంటర్వ్యూలు, తెరవెనుక ఫుటేజీలతో భారతీయ, అంతర్జాతీయ సినిమాలపై రాజమౌళి ప్రభావాన్ని హైలైట్ చేసే విధంగా డాక్యుమెంటరీ రూపొందించింది. భారతీయ సృజనాత్మకతలపై నెట్‌ఫ్లిక్స్ యొక్క మోడరన్ మాస్టర్స్ డాక్ సిరీస్‌లో ఈ చిత్రం భాగంగా ఉంటుంది.
దీని గురించి నిర్మాత, హోస్ట్ చోప్రా మాట్లాడుతూ.. ఎస్ఎస్ రాజమౌళి ఒక దార్శనికుడని, అతని ఊహ భారతీయ సినిమా గమనాన్ని మార్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అతడి నైపుణ్యం ఆకర్షిందన్నారు. అసాధారణ కెరీర్, సినీ ప్రపంచంపై ఆయన చూపిన శాశ్వత ప్రభావాన్ని చూపించనుండం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీ కోసం నెట్‌ఫ్లిక్స్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అప్లాజ్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ నాయర్ అన్నారు. రాజమౌళి సృజనాత్మక కథనా శైలి భారతీయ చలనచిత్ర నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి అని అన్నారు. అతడి సాహసోపేతమైన స్ఫూర్తి, ఫాంటసీ, ఇతిహాస కళా ప్రక్రియల నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా వినోదాన్ని ఇష్టపడే ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిందన్నారు.
View this post on Instagram