Movies Postpone : ఈ సినిమాలు ఇంకెప్పుడు రిలీజ్ అవుతాయి బాబు.. వాయిదాల మీద వాయిదాలు..

కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఈ మధ్య బాగా లేట్ అయ్యాయి. వాటిల్లో కొన్ని ఇవే..

Movies Postpone : ఈ సినిమాలు ఇంకెప్పుడు రిలీజ్ అవుతాయి బాబు.. వాయిదాల మీద వాయిదాలు..

Prabhas Pawan Kalyan and Some Heros Movie Delay Too Much for Releasing

Updated On : March 10, 2025 / 9:27 PM IST

Movies Postpone : కొన్ని సినిమాలు చాలా లేట్ గా రిలీజ్ అవుతాయి. ఆర్టిస్టుల డేట్స్ దొరక్క, ఆర్ధిక ఇబ్బందులు, రిలీజ్ కి సరైన డేట్ దొరక్క.. ఇలా రకరకాల కారణాలతో సినిమాలు లేట్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఈ మధ్య బాగా లేట్ అయ్యాయి. వాటిల్లో కొన్ని ఇవే..

రోజులతరబడి డేట్స్ తీసుకుంటూనే ఉన్నారు. సంవత్సరాలు సంవత్సరాలు షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే సినిమా అవ్వట్లేదు, ధియటర్లోకి రావడం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు నిన్నా మొన్నా కాదు ఏకంగా 4 ఏళ్లనుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. 2020లో హరిహరవీరమల్లు సినిమా అనౌన్స్ చేసింది టీమ్. ఇదిగో అయిపోతోంది.. అదిగో అయిపోతోందని అనడం.. అభిమానులు ఎదురుచూడడం 4 ఏళ్లనుంచి నడుస్తూనే ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో సినిమా మరోసారి రిలీజ్ డిలే అయ్యింది. మార్చి 28న ఎట్టిపరిస్తితుల్లో సినిమా రిలీజ్ చేస్తామన్న నిర్మాత ఎ.ఎమ్ రత్నం ఈసారి కూడా రిలీజ్ డేట్ మార్చుకోవాల్సివస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడు థియేటర్లోకొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

Also Read : NTR : ఎన్టీఆర్ ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేశాడా?

లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ కాదు అంతకు ముందెప్పుడో 2022లో మొదలైన రాజాసాబ్ కూడా ఇంకా షూటింగ్ సాగిస్తూనే ఉంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో 2022లో మొదలైన సినిమా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. హార్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిన్న సినిమాగా మొదలైంది. అయితే ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో సినిమా రేంజ్ ని పెంచేశారు మేకర్స్. దాంతో స్టార్ కాస్ట్, గ్రాండియర్, స్కేల్ ఇలా ప్రతీ విషయంలో టైమ్ తీస్కోవడంతో మూడేళ్ల నంచి షూటింగ్ సాగుతూనే ఉంది. ఏప్రిల్ 10న థియేటర్లోకొస్తున్నట్టు అనౌన్స్ చేసిన రాజాసాబ్ షూట్ కంప్లీట్ చేసుకునేదెప్పుడో.

స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు అంచనాలు కాస్త అటూ ఇటైనా సినిమా రిజల్ట్ ఊహించలేని రేంజ్ లో ఉంటుంది. అలా విశ్వంభర సినిమా టీజర్ విషయంలో ముందే జాగ్రత్తపడ్డారు మేకర్స్. టీజర్ ట్రోలింగ్ ఫేస్ చెయ్యడంతో కరెక్షన్స్ కోసం రంగంలోకి దిగారు. అందుకే ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కావల్సిన సినిమాని పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ అన్నారు కానీ ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ని చూస్తే సమ్మర్ కి అయ్యేలా కనిపించడం లేదు. 2023 లో మొదలైన ఈ సినిమాకి వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు డైరెక్టర్ వశిష్ఠ.

Also Read : Nagarjuna – Puri Jagannadh : నాక్కొంచెం మెంటల్.. ‘సూపర్’ హిట్ ‘శివమణి’ కాంబో మళ్ళీ..?

3 ఏళ్ల క్రితం అనుకున్న సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి ఆపసోపాలు పడుతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగార్జున, ధనుశ్ , రష్మిక లీడ్ రోల్స్ లో సోషల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కుబేర మూవీ లాస్ట్ ఇయర్ నుంచి షూటింగ్ చేస్తూనే ఉంది. లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. ఇప్పటికే డిలే అయిన ఈ సినిమా ఈ సంవత్సరం జూన్ 20న థియేటర్లోకి రాబోతోంది.

పెద్ద హీరోల సినిమాలంటే భారీగా చెయ్యాలి కాబట్టి ఒక్కో సారి షూట్ లేటయ్యే చాన్స్ ఉంటుంది. అయితే నితిన్ లాంటి మీడియం హీరోల సినిమాలకు కూడా సంవత్సరాలు సంవత్సరాలు టైమ్ తీసుకుంటున్నారు మేకర్స్. 2023లో మొదలైన తమ్ముడు సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటికే షూటింగ్ డిలేతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తోంది ఈ సినిమా. నితిన్, లయ మెయిన్ లీడ్స్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా షూట్ కంప్లీట్ అవ్వకపోవడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యలేదు. మరి ఈ సినిమాలు ఎప్పుడు షూట్ కంప్లీట్ చేస్తాయో, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తాయో అని ఆ హీరోల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలానే ఉంటాయి.