ప్రభాస్ షాక్ :  ‘అర్జున్ రెడ్డి’ కంటే ‘కబీర్ సింగ్’ బాగుంది

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 06:29 AM IST
ప్రభాస్ షాక్ :  ‘అర్జున్ రెడ్డి’ కంటే ‘కబీర్ సింగ్’ బాగుంది

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ షాకిచ్చాడు. బాలీవుడ్ యంగ్ స్టార్ ను పొగడ్తలతో ముంచెత్తి విజయ్ ను చిన్నబుచ్చాడు ప్రభాస్. చాలా షార్ట్ టైంలో కష్టపడి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీతో రౌడీ హీరోగా విజయ్ సందడి చేశాడు. ఈ మూవీని తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే రీసెంట్ గా అర్జున్ రెడ్డీ హిందీ రీమేక్ మూవీ కబీర్ సింగ్ టీజర్ రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డీ మూవీకి ఏ మాత్రం తీసిపోకుండా యాజిటీజ్ గా ఉంది. షాహిద్ కపూర్, కియార అద్వాని హీరో హీరోయన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ తరువాత షాహిద్ ఇండస్ట్రీ నుండి మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షాహిద్ ను పర్సనల్ గా అభినందించాడు.

కబీర్ సింగ్ టీజర్ రిలీజ్ తరువాత ప్రభాస్ ఈ టీజర్ ను చూసి షాహిద్ కు పోన్ చేసినట్టు తెలుస్తుంది.. ప్రభాస్ పర్సనల్ మేకప్ మెన్ నుండి మీడియా తెలిసిన న్యూస్ ప్రకారం..టీజర్ చూసిన ప్రభాస్ షాహిద్ తో ఏడు నిమిషాలు పోన్ లో మాట్లాడాడు.. కబీర్ సింగ్ టీజర్ బాగుందని బ్రిలియంట్ గా చేశాడని చెప్పడంతో పాటు ఒరిజినల్ వర్షన్ అర్జున్ రెడ్డి కంటే కూడా బాగుందని చెప్పి అందరిని షాక్ ఇచ్చాడు ప్రభాస్. టీజర్ బాగుంది అనడంతో పాటు ఒరిజనల్ వర్షన్ కంటే బాగుంది అని అనడంతో అందరి ఇంట్రస్ట్ ఆ కామెంట్ వైపు మళ్ళింది. మరో వైపు విజయ్ దేవరకొండ కూడా కబీర్ సింగ్ టీజర్ పై ట్విట్ చేశాడు. టీజర్ బాగుందని, షాహిద్ కపూర్ తో పాటు కియారా అద్వాని కి తన బెస్ట్ విషెష్ అండ్ లవ్ ను తెలుపుతున్నట్టు ట్వీట్ చేశాడు.. 

మరో వైపు కబీర్ సింగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీని  డైరక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలో కూడా డైరక్ట్ చేస్తున్నారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో డైరక్టర్ తో పాటు మూవీ టీం పెద్ద పార్టీ కూడా చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని జూన్ సెకండ్ వీక్ కాని థర్డ్ వీక్ లో కాని సినిమాను రిలీజ్ చేయడానకి ప్లాన్ చేస్తున్నారు..