Prabhas : రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్-1 ని నిన్న రాత్రి విడుదల చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ స్ట్రీమింగ్‌లో రికార్డులు నెలకొలుపుతుంది.

Prabhas : రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..

Prabhas unstoppable episode creating records

Updated On : December 30, 2022 / 2:07 PM IST

Prabhas : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్-1 ని నిన్న రాత్రి విడుదల చేశారు. అయితే రిలీజ్ సమయంలో ఆహా వెబ్ సైట్ కొన్ని సాంకేతిక లోపాలు ఎదురుకోవడంతో, కొంతసేపు ఆహా ప్లాట్‌ఫార్మ్ పని చేయలేదు. దీంతో ఆహా కంటే ముందే పలు సోషల్ మీడియా వెబ్‌సైట్ లో ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యిపోయింది.

Prabhas Shoe Size : ప్రభాస్ సైజ్ బట్టలు, షూస్ బయట దొరకవంట.. ప్రభాస్ షూ సైజ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

అయినా సరే ఆహాలో ఈ ఎపిసోడ్ రికార్డులు సృష్టిస్తుంది. విడుదలయిన 12 గంటలోనే ఈ ఎపిసోడ్ 50 మిలియన్ల మినిట్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇతర భాషల్లోని ప్రభాస్ అభిమానులు కూడా కోరడంతో ఈ ఎపిసోడ్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చారు షో నిర్వాహకులు. దీంతో ఇతర భాషలోని ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్ ని వీక్షించడంతో 50 మిలియన్ మార్క్ ని సులువుగా అందుకుంది.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్.. ‘విడుదలైంది పార్ట్-1 మాత్రమే, జనవరి 6న రిలీజ్ కానున్న పార్ట్-2 వరకు ఎదురు చూడండి. ఈ రికార్డుని మళ్ళీ మేమే తిరగ రాస్తాము’ అంటున్నారు. కాగా విడుదలైన పార్ట్-1 చాలా హిలేరియస్ గా సాగింది. ప్రేమ, పెళ్లి విషయాలు గురించి ప్రభాస్ ని ముప్పతిప్పలు పెట్టాడు బాలయ్య. ఇక ఎపిసోడ్ కే హైలైట్ రామ్ చరణ్ ఫోన్ కాల్. మరి పార్ట్-2 ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.