Prakash Raj:’మా’కు పోటీగా మరో అసోసియేషన్..? ప్రకాష్ రాజ్ సంచలనం!
రసవత్తరంగా సాగిన 'మా' అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉత్కంఠ పోరులో ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు.

Prakash Raj
Prakash Raj: రసవత్తరంగా సాగిన ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉత్కంఠ పోరులో ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. ఎన్నికలు ముగిశాక వివాదాలు సర్ధుకుంటాయి. మేమంతా ఒకటే అంటూ సినిమా వాళ్లు ప్రకటించారు కూడా.. కానీ, ఇప్పట్లో ఈ వివాదాలకు తెరపడే అవకాశం కనిపించట్లేదు. వరుస రాజీనామాల పర్వాలతో మళ్లీ “మా” రాజకీయం హీటెక్కింది.
కళకు ప్రాంతీయ భేదం ఉంటుందా?
కళకి భాషాభేదం అంటగట్టారంటూ.. ప్రాంతీయవాదం తీసుకుని వచ్చారంటూ.. పాన్ ఇండియా లెవల్లో మన సినిమాలు విడుదలవుతుంటే, ఇక్కడ మాత్రం నాన్ లోకల్ అంటూ విష్ణు ప్రచారం చేయడమే తప్పుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ గెలవకపోవడంతో మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శివాజీరాజా రాజీనామా చేస్తారంటూ వార్తలు వచ్చాయి.
నూతన అసోసియేషన్ పేరు ATMAA (ఆత్మ)..??
అంతేకాదు.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసిన వారంతా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ‘మా’ అసోసియేషన్‌కి పోటీగా ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ “ఆత్మ”(ATMAA) పేరుతో అసోసియేషన్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా.. 8 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ అభ్యర్థులు గెలిచారు. వీరంతా కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
5గంటలకు సంచలన ప్రెస్ మీట్:
ప్రకాష్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ(ఉపాధ్యక్షుడు), శ్రీకాంత్(ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), ఉత్తేజ్(జాయింట్ సెక్రటరీ) ఈసీ మెంబర్లుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేశ్ కొండేటి, సమీర్, సుడిగాలి సుధీర్, కౌశిక్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయంత్రం 5గంటలకు సంచలన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ప్రకాష్ రాజ్. ఈ ప్రెస్‌మీట్‌లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.