Prakash Raj : నిన్ను చూస్తే గర్వంగా ఉంది దీపికా.. ‘బేషరం’ బిగోట్స్ ఫిఫాని కూడా బ్యాన్ చేస్తారా.. ప్రకాష్ రాజ్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా విడుదలైన 'బేషరం' సాంగ్ లో దీపికా డ్రెస్సింగ్ పై విమర్శలు వస్తున్న సమయంలో, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించాడు.

Prakash Raj supports Deepika Padukone in besharam rang controversy
Prakash Raj : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుంది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జనవరి 25న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ట్రైలర్ మరియు ఒక పాటని ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేశారు మేకర్స్.
Pathaan : ‘పఠాన్’పై శక్తిమాన్ ఆగ్రహం..
అయితే విడుదలైన ‘బేషరం రంగ్’ అనే పాటలో అశ్లీలత ఎక్కువ ఉంది అంటూ నెటిజెన్లు మరియు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మత సంఘాలు వరకు అందరి నుంచి విమర్శలు ఎదురుకుంటుంది. తాజాగా ఈ వివాదంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించాడు. నిన్న జరిగిన ఫుట్ బాల్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో హీరోయిన్ దీపికా పడుకోణె అరుదైన గౌరవం దక్కించుకుంది.
ఫిఫా వరల్డ్ కప్ ని ఆవిష్కరించే అవకాశాన్ని అందుకొని.. భారతదేశం నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న సినీ తారగా పేరుని సంపాదించుకుంది దీపికా. ఇక ‘బేషరం’ సాంగ్ లో తన డ్రెస్సింగ్ పై విమర్శలు వస్తున్న సమయంలో, దీపికా ఫిఫా కప్ ని ఆవిష్కరించడంతో ప్రకాష్ రాజ్.. “నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది దీపికా. ఇప్పుడు ఈ ‘బేషరం బిగోట్స్’ ఫిఫాని కూడా బ్యాన్ చేస్తారా?” అని ప్రశ్నిస్తూ దీపికకి మద్దతుగా నిలిచాడు.
Proud of you @deepikapadukone .. Will #BesharamBigots BAN #FIFAWorldcup now #KhelaHobe …#justasking pic.twitter.com/q5iNux66JT
— Prakash Raj (@prakashraaj) December 19, 2022