Priyanka Chopra : సీక్రెట్‌గా.. సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా..

గ్లోబల్ స్టార్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సరోగసి విధానంలో ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నికో జోనస్ తల్లిదండ్రులయ్యారు. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Priyanka Chopra : సీక్రెట్‌గా.. సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా..

Priyanka Chopra Actor Singer Priyanka Chopra And Musician Nick Jonas Have Welcomed A Baby Via Surrogacy

Updated On : January 22, 2022 / 8:01 AM IST

Priyanka Chopra : గ్లోబల్ స్టార్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సరోగసి విధానంలో ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నికో జోనస్ తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని ఇద్దరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రియాంక, నిక్ పోస్టులతో వారి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. అయితే తాము సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చే విషయం సీక్రెట్ గా ఉంచారు. ఈ సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని ప్రియాంక తన అభిమానులను కోరింది. అద్దె గర్బం విధానంలో బిడ్డకు జన్మనిచ్చినట్టు వెల్లడించారు. అయితే ప్రియాంక జోనస్ దంపతులకు పుట్టింది ఆడ బిడ్డా? లేదా మగ బిడ్డ అనేది రివీల్ చేయలేదు.

అమెరికన్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రియాంక చోప్రాకు ఆడ పుట్టినట్లు సమాచారం. కాలిఫొర్నియాలోని ఓ ఆస్పత్రిలో శనివారం పాపకు ప్రియాంక జన్మనిచ్చినట్టు తెలిపింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లకు ఇదే తొలి సంతానం. ప్రియాంక చోప్రా గర్భం దాల్చినట్టు ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఆమె గర్భంతో కనిపించిన సందర్భాలు లేవు. తామిద్దరూ తల్లిదండ్రులు అయినట్టుగా ప్రియాంక, జోనస్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రియాంక చోప్రా స్వయంగా ఆ బిడ్డకు జన్మనివ్వలేదు. సరోగసి విధానంలో వీరిద్దరు తల్లిదండ్రులయ్యారు. ఇటీవలే ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. పిల్లలతో పాటు తన కెరీర్​ను​ బ్యాలెన్స్​ చేసుకోగలనని చెప్పుకొచ్చింది.

Priyanka Chopra

ప్రియాంక, జోనస్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. 2018లో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్​ను ప్రియాంక చోప్రా పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్దతుల్లో వివాహ వేడుకను జరుపుకున్నారు. ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా అకౌంట్లలో భర్త పేరును తొలగించడంతో విడిపోతున్నారనే టాక్ నడిచింది. కానీ, ఎవరూ ఊహించినట్టుగా వీరిద్దరు తల్లిదండ్రులు అయినట్టుగా అందరిని సర్ ప్రైజ్ చేశారు. ప్రియాంక చోప్రా నటించిన ‘ద మ్యాట్రిక్ 4’ మూవీ 2021 ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియాంక నటించిన హిందీ మూవీ ‘ద వైట్ టైగర్’.. ఓటీటీ ప్లాట్ ఫాం నెట్​ఫ్లిక్స్​లో రిలీజైంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే టీవీ షోలో ప్రియాంక చోప్రా నటిస్తోంది. ‘టెక్స్ట్ ఫర్ యూ’ మూవీతోనూ ప్రియాంక బిజీగా ఉంది.

Read Also : Andre Russel: బీపీఎల్ మ్యాచ్ లో విచిత్రంగా ఔటైన ఆండ్రే రస్సెల్