హీరోలు రెమ్యునిరేషన్ తగ్గించుకోవాల్సిందే, కరోనాతో నేనూ బాగా దెబ్బతిన్నా: నిర్మాత సురేష్ బాబు
టాలీవుడ్‌పై లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఎంత వరకు?.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత సురేష్ బాబు స్పందన..

టాలీవుడ్‌పై లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఎంత వరకు?.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత సురేష్ బాబు స్పందన..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. షూటింగులు నిలిచిపోయాయి.. థియేటర్లు మూత పడ్డాయి.. రోజువారీ కూలికి పనిచేసే కార్మికులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు, మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ ( సీ సీ సీ) ముందుకొచ్చారు. అసలు సినిమా పరిశ్రమ తర్వాతి అడుగు ఎలా వేయనుంది. షూటింగులు, థియేటర్లు తిరిగి రన్ అవడం.. నిర్మాతల కష్టాలు, ఇండస్ట్రీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి.. ఇలా తలెత్తున్న పలు ప్రశ్నలకు, సందేహాలకు తనదైన శైలిలో స్పందించారు ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు..
చిత్ర పరిశ్రమలో నెలకొన్న సందిగ్ధత గురించి పలు విషయాలు 10 టీవీకి వెల్లడించారు.. ‘ప్రస్తత పరిస్థితిలో సినిమా పరిశ్రమ రెవెన్యూ జీరో పర్సంట్.. ఇండియాలో ఉన్న 10 వేల థియేటర్లలో నాలుగు నుండి అయిదు లక్షల మంది పనిచేస్తున్నారు. ఒకొక్క ఇండస్ట్రీలో 25 నుంచి 50 వేల మంది నటీనటులున్నారు. అప్పు తీసుకున్న నిర్మాతలకు వడ్డీ ఒత్తిడి ఉంటుంది. రోజువారీ వేతనానికి పనిచేసే వర్కర్స్, యాక్టర్ల రెవెన్యూ జీరో అయిపోయింది. స్టూడియోలలో పనిచేసే వారిదీ ఇదే పరిస్థితి. స్టూడియో, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్.. నలుగురికీ కష్టాలున్నాయి. జనసమూహం ఎక్కువగా ఉండే రెస్టారెంట్స్, పబ్స్, పెళ్లిల్లు, థియేటర్స్ వంటివి చివర్లో ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే..
రోజువారి పనిచేసే కార్మికులను సీ సీ సీ ద్వారా ఆదుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ చిన్న సినిమాలకు బాగానే ఉంటుంది కానీ మీడియం మరియు పెద్ద బడ్జెట్ సినిమాలకు ఓటీటీ భారీ ఎకానమీ ప్యాకేజ్ ఇవ్వలేదు. మా బ్యానర్ విషయానికొస్తే ‘నారప్ప’, ‘విరాట పర్వం’, ‘క్రష్’, ‘క్రిష అండ్ హిజ్ లీల’ వంటి నాలుగు సినిమాలు ఆగిపోయాయి.. మళ్లీ మంచి రోజులు వస్తాయి.. జాగ్రత్తగా ఉందాం’.. అంటూ సురేష్ బాబు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తూ.. సినీ వర్గాలు మరియు ప్రేక్షకుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు..
Read Also : పేద కళాకారులకు ‘డిగ్రీ కాలేజ్’ హీరో వరుణ్ సాయం