నిఖిల్ నువ్వు మగాడివా?

హీరో నిఖిల్‌పై ఫైర్ అయిన నిర్మాత నట్టి కుమార్.

  • Published By: sekhar ,Published On : January 26, 2019 / 10:21 AM IST
నిఖిల్ నువ్వు మగాడివా?

హీరో నిఖిల్‌పై ఫైర్ అయిన నిర్మాత నట్టి కుమార్.

యంగ్ హీరో నిఖిల్‌పై, నిర్మాత నట్టి కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. నిఖిల్‌కి దమ్మూ, దైర్యం ఉంటే తన ప్రశ్నలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసాడు. అసలు ఈ వివాదానికి బీజం ఎక్కడ పడిందంటే, నిఖిల్ నటిస్తున్న ముద్ర సినిమా  టైటిల్ లోగోకీ, నట్టి కుమార్ నిర్మిస్తున్న సినిమా టైటిల్ లోగోకీ చాలా దగ్గర పోలికలున్నాయి. పోలికలు కాదు, రెండూ ఒకేలా ఉన్నాయి. పైగా టైటిల్ కూడా ముద్రనే. నట్టి కుమార్ ముద్ర సినిమా జనవరి 25న రిలీజ్ అవుతుందని ప్రమోట్ చేసుకుంటుండగా, సదరు టైటిల్ లోగో చూసిన నిఖిల్, తన సినిమా పేరు, తన పేరు వాడుకుని టికెట్స్ అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

దీంతో, నట్టి కుమార్‌కి కోపం నషాళానికంటింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ముద్ర అనే టైటిల్ ఫిలిం చాంబర్ తనకిచ్చిందనీ, పబ్లిసిటీ క్లియరెన్స్‌తో పాటు, కేంద్ర ప్రభుత్వం సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. నిఖిల్ నువ్వు మగాడివైతే, ఆధారాలు చూపించి, ఛానెల్‌లో డిబేట్ కొస్తావో, ఛాంబర్‌లో మీటింగ్ పెడతావో, పోనీ, నీ ఇంటికి నన్ను రమ్మంటావో? నేను తప్పు చేసానని నువ్వు నిరూపిస్తే, నేను దేనికైనా సిద్ధం.. లేకపోతే, నువ్వు ఇండస్ట్రీ నుండి హీరోగా విరమించుకుని వెళ్ళి పోతావా అంటూ తన ఆవేశాన్నంతా వెళ్ళగక్కాడు నిర్మాత నట్టి కుమార్. దీనిపై నిఖిల్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి మరి.

వాచ్ వీడియో…