Allu Arjun : ‘పుష్ప 2’ ఈ సంవత్సరం లేనట్టేనా??
ప్రస్తుతం ‘పుష్ప 2’ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు సుకుమార్. 'పుష్ప 2' సినిమాని ఈ సంవత్సరం చివర్లో డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తామని అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు..........

Pushpa 2
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా దేశమంతటా భారీ విజయం సాధించింది. అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. దీంతో పుష్ప పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అల్లు అర్జున్ గతంలో ‘పుష్ప 2’కి గ్యాప్ తీసుకుందాం అనుకున్నాడు కానీ ‘పుష్ప’ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి ‘పుష్ప2’ మొదలు పెట్టేయాలని ఫిక్స్ అయ్యాడు.
ప్రస్తుతం ‘పుష్ప 2’ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు సుకుమార్. ‘పుష్ప 2’ సినిమాని ఈ సంవత్సరం చివర్లో డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తామని అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ‘పుష్ప 2’ మరింత లేట్ అయ్యేట్టు కమనిపిస్తుంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా కోసం సుకుమార్ అండ్ టీం లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నారు. కేరళ, నల్లమల, వికారాబాద్ అడవులతో పాటు మరి కొన్ని లొకేషన్స్ కోసం వెతుకుతున్నారు.
RRR : థియేటర్ వద్ద బ్యానర్స్ విషయంలో గొడవ.. ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్నం..
ఎలాగైనా ‘పుష్ప 2’ ఏప్రిల్ లో షూట్ మొదలు పెట్టాలని సుకుమార్ అనుకుంటున్నారు. కానీ అవుట్ డోర్ లో సమ్మర్లో స్టార్లు షూట్ చేయడం కష్టమే. ఒకవేళ మొదలు పెట్టినా షూట్ మెల్లిగానే సాగుతుంది. ఇంకా ‘పుష్ప 2’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉండటంతో ఈ సినిమాని జూన్ నుంచి షూట్ కి వెళ్లనున్నారు. అంతే కాక ప్రస్తుతం రష్మిక, ఫాహిద్ ఫాజిల్ బిజీగా వున్నారు. వాళ్ళ డేట్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఇవన్నీ చూసుకొని షూట్ కంప్లీట్ చెయ్యాలంటే కొంత ఎక్కువ సమయమే పడుతుంది. దాదాపు మూడు నెలలకు పైగా ఈ సినిమాని షూట్ చేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి మరో మూడు నెలలు ఈజీగా పడుతుంది.
Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ నుంచి మహేష్‌బాబు స్టిల్స్
ఇలా సినిమా పూర్తయ్యే సరికి డిసెంబర్ అవుతుంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే డిసెంబర్ లోనే సినిమా రిలీజ్ చేస్తారు. లేదా ఆ టైంకి సినిమా ఫైనల్ అవుట్ పుట్ రాకపోయినా, తెలుగులోనే కాక, హిందీలో కూడా వేరే పెద్ద సినిమాలు ఏమైనా ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటం ఖాయం. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో వేరే భాషల్లో కూడా స్టార్ హీరోల సినిమాలు లేని టైంలో చూసుకొని ‘పుష్ప 2’ని రిలీజ్ చేయాలి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని బన్నీ అభిమానులు కంగారు పడుతున్నారు. అంతా సుక్కు చేతిలోనే ఉంది అని అనుకుంటున్నారు.