Radhe Shyam: మార్చి 11న రిలీజ్.. పబ్లిసిటీ మాత్రం సైలెంట్ మోడ్.. ఎందుకిలా?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా..

Radhe Shyam: మార్చి 11న రిలీజ్.. పబ్లిసిటీ మాత్రం సైలెంట్ మోడ్.. ఎందుకిలా?

Radhe Shyam

Updated On : February 21, 2022 / 5:58 PM IST

Radhe Shyam: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. కానీ ఈసారి సమ్మర్ రిలీజ్ ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం పక్కా అంటున్న మేకర్స్ మార్చి రెండో వారంలో ముహూర్తం పెట్టేశారు.

Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

మార్చి 11 అంటే గట్టిగా మూడు వారాలు. కానీ ఇప్పటికి ఈ సినిమా గురించి ప్రమోషన్ ఎక్కడా లేదు. వాలంటైన్ డే రోజుల గ్లిమ్ప్స్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్ యూనిట్ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. గతంలో సంక్రాంతి టైంలో కూడా అప్పుడు రిలీజ్ అనుకున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ దేశమంతా చక్కర్లు కొడుతూ ప్రమోషన్లు హోరెత్తిస్తుంటే.. రాధేశ్యామ్ మాత్రం తీరిగ్గా ప్రమోషన్లు మొదలు పెట్టారు.

Radhe Shyam: 10 వేల థియేటర్లలో రాధేశ్యామ్.. ఏంటి నిజమా?

ఇప్పుడు కూడా అంతే.. ఇరవై రోజులలో పాన్ ఇండియా స్థాయి రిలీజ్ ఉన్నా చడీ చప్పుడు లేకుండా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేస్తే పబ్లిసిటీ మొదలు పెట్టారు. లవ్ స్టోరీ.. అది కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ సినిమా కాబట్టే సినిమామీద అంచనాలు పెరగకుండా రాధేశ్యామ్ యూనిట్ ఏదైనా ప్లాన్ లో ఉందా అనే అనునామాలు కూడా వినిపిస్తున్నాయి.