Rajamouli : బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి కొత్త యాడ్ చూశారా.. దానిలో కూడా జక్కన్న మార్క్..

రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పో ఫోన్ యాడ్ అదిరిపోయింది. ఆ యాడ్ కూడా జక్కన్న మార్క్ తో అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చూసేయండి.

Rajamouli : బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి కొత్త యాడ్ చూశారా.. దానిలో కూడా జక్కన్న మార్క్..

Rajamouli as brand ambassador for oppo phone ad released

Updated On : June 28, 2023 / 9:15 PM IST

Rajamouli : బాహుబలి (Bahubali) సినిమాతో దేశం మొత్తాన్ని, RRR సినిమాతో ప్రపంచం మొత్తాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేసిన జక్కన్న రాజమౌళి.. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నాటు నాటుతో తెలుగు వారిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లిన ఈ దర్శకధీరుడిని ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తుంది. దీంతో కొన్ని కంపెనీలు రాజమౌళి ఫేమ్ ని తమకి అనుగుణంగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ కంపెనీ ఒప్పో (Oppo).. రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసడర్ గా చేసుకుంది.

King of Kotha Teaser : దుల్కర్ పాన్ ఇండియా మూవీ టీజర్‌ని లాంచ్ చేసిన మహేష్.. చిరు, రజినితో పోటీ!

ఇక తమ కొత్త ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం రాజమౌళితో యాడ్ ని షూట్ చేశారు. తాజాగా ఈ యాడ్ ని రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఈ యాడ్ లో ఒక వ్యక్తి ఫోన్ తో ఫోటో తియ్యడానికి ట్రై చేస్తుంటే.. రాజమౌళి తనకి కరెక్ట్ ఫ్రేమ్ సెట్ చేసి ఇస్తాడు. ఆ ఫ్రేమ్ తో ఫోటో తియ్యగానే ఫోటో తీసిన వ్యక్తి రాజమౌళిలా మారిపోతాడు. అలాగే రాజమౌళి మరొకరికి కూడా ఐడియా ఇవ్వగా వారు కూడా జక్కన్నలా మారిపోతారు. ఈ యాడ్ చూసిన వారు ఐడియా బాగుంది అంటూ జక్కన్న మార్క్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ యాడ్ ని ఎవరు డిజైన్ చేశారు అన్నది తెలియదు. మరి ఆ యాడ్ ని ఒకసారి మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

ఇది ఇలా ఉంటే, రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో (Mahesh Babu) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ లో చిత్రీకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే పలు హాలీవుడ్ సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ ని కూడా ఆగష్టు నెల లోపు కంప్లీట్ చేసి రాజమౌళికి అందజేస్తానంటూ ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలియజేశాడు. అలాగే ఈ సినిమా ఓపెన్ ఎండింగ్ తో ఉంచుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకవేళ కుదిరితే సీక్వెల్ ని కూడా తీయొచ్చని తెలియజేశాడు.