తలైవా క్రేజ్ అలాంటిది : .అప్పుడు కబాలీ…ఇప్పుడు దర్బార్

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 09:21 AM IST
తలైవా క్రేజ్ అలాంటిది : .అప్పుడు కబాలీ…ఇప్పుడు దర్బార్

Updated On : January 2, 2020 / 9:21 AM IST

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ కి లేక్కలేనంత మంది అభిమానులున్నార‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌న సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే ప్రతి చోట పండుగే. తాజాగా ర‌జనీకాంత్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్భార్ అనే సినిమా చేశారు. ఆ సినిమా సంక్రాంతి సందర్భంగా (జ‌న‌వ‌రి 9, 2020)న విడుద‌ల కానుంది.  

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కారణంగా లైకా నిర్మాణ సంస్థ‌ సినిమాకి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తుంది. ఈ సినిమాల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ బ‌స్సులు, రైళ్ళే కాదు ఏకంగా ఫ్లైట్ల‌పై కూడా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. తాజాగా ద‌ర్భార్ సినిమా పోస్ట‌ర్స్ కూడా విమానాల‌పై ద‌ర్శ‌నం ఇచ్చాయి. ఈ ఫోటోలను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

ఈ సినిమాలో సునీల్ శెట్టి, నివేదా ధామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రజనీకాంత్ ను పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో ఆర్కిటెక్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.