రకుల్ చేస్తున్న క్యారక్టర్ ఇదా.. ‘దేదే ప్యార్ దే’ ట్రైలర్ చూశారా..?

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో ‘దేదే ప్యార్ దే’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అకివ్ అలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులోని సన్నివేశాలు అభిమానులకి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. సినిమాలో అజయ్ దేవ్ గన్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నాడు. టబు ఆయన భార్యగా నటిస్తుంది.
ఆశిష్( అజయ్ దేవగన్) మరియు అయేషా( రకుల్ ప్రీత్ సింగ్) జీవితంలో జరిగిన సంఘటలని ఫన్నీగా ట్రైలర్‌లో చూపించారు. అజయ్ (50) మరియు అయేషా ( 26) లండన్లో ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. తన కంటే 24 ఏళ్లు చిన్న అమ్మాయితో ప్రేమ అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. గతంలో ఇలాంటి కాన్సెప్టుతోనే చీనీ కమ్ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఇది పూర్తిగా ఫన్ యాంగిల్లోనే సాగుతుంది. పైగా తన వయసుపై తనే సెటైర్లు వేయించుకున్నాడు అజయ్.
2017లో విడుదలైన గోల్‌మాల్ ఎగైన్ చిత్రం నేపథ్యంలోనే దేదే ప్యార్ దే చిత్రం ఉంటుందని అంటున్నారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్, అలోక్ నాథ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.