NTR 100 Years : తారక్, నేను కాదు.. సౌత్ ఇండియాని వరల్డ్ మ్యాప్‌లో పెట్టిన నటుడు ఎన్టీఆర్.. రామ్‌చరణ్!
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయిన రామ్ చరణ్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ బ్రతుకున్నంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు బ్రతికే ఉంటుంది. తారక్, నేను కాదు..

ram charan speech at 100 Years of NTR function
100 Years of NTR : 2023 మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి జరుగుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే ఇటీవల విజయవాడ(Vijayawada)లో భారీ సభ నిర్వహించగా రజినీకాంత్(Rajinikanth) ముఖ్య అతిథిగా వచ్చాడు. తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు.
NTR 100 Years : బాలయ్యతో వివాదం.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నాగచైతన్య.. ఏమి మాట్లాడాడో తెలుసా?
ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, జయసుధ, జయప్రద, శ్రీలీల, అలాగే దర్శకులు తదితరులు హాజరయ్యారు. ఇక కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అంత స్థాయిలో నేను లేను. మన స్థాయిని, మన ఆలోచన స్థాయిని మించి ఎన్టీఆర్ గారు శిఖరాస్థాయిని అందుకున్నారు. అలాంటి వ్యక్తులు గురించి ఎక్కువ మాట్లాడడం కంటే, ఆయన నడిచిన దారిలో మనం నడవడమే గౌరవం” అంటూ చెప్పుకొచ్చాడు.
“ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు నాతో సహా ప్రతి రోజు ఆయన గురించి మాట్లాడాల్సిందే. ఆయన నటించిన ఇండస్ట్రీలో నేను నటిస్తునందుకు గౌరవంగా ఉంది. సౌత్ ఇండియా పేరు ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పుడు వినిపిస్తుందని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు మేము కాదు, ఆ కాలంలోనే దేశదేశాల్లో సౌత్ ఇండియా పేరుని వినిపించేలా చేశారు. తెలుగు ఇండస్ట్రీ బ్రతుకున్నంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు బ్రతికే ఉంటుంది” అంటూ వెల్లడించాడు.
NTR : ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూ. ఎన్టీఆర్ దూరం
అలాగే ఎన్టీఆర్ తో కలిసి టిఫిన్ చేసిన ఒక విషయం కూడా పంచుకున్నాడు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కుమారుడు రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులు. 6వ తరగతి చదువుతున్న సమయంలో స్కెటింగ్ క్లాస్స్ నుంచి ఒకసారి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారట ఇద్దరు. ఎన్టీఆర్ అప్పుడు సీఎంగా ఉన్నారు. ఇన్నిటికి వెళ్లిన చరణ్ అండ్ పురందేశ్వరి కుమారుడు కలిసి ఎన్టీఆర్ తో టిఫిన్ చేశారట. ఎన్టీఆర్ ని కలవడం చరణ్ కలవడం లైఫ్ లో అదేనని చెప్పుకొచ్చాడు.