Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు..
సీఎం జగన్‌తో భేటీ అయిన రామ్ గోపాల్ వర్మ. అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ తో దాదాపు గంటకు పైగా RGV భేటీ అయ్యాడు. ఈ భేటీలో..
![Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు.. Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు..](https://10tv.in/wp-content/uploads/2023/06/Ram-Gopal-Varma-meets-YS-Jagan-Mohan-Reddy-on-point-of-Vyooham-movie.jpg)
Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie
Ram Gopal Varma Vyooham : రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ అంశాలు పై సినిమా తియ్యబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘వ్యూహం’, ‘శపథం’ అనే టైటిల్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు. అప్పటి నుంచి షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వచ్చాడు.
Adipurush : ఆదిపురుష్ సినిమాలో ఆక్వామ్యాన్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్.. మీరు గమనించారా..?
ఈ క్రమంలోనే మూవీలోని సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), వైఎస్ భారతి (Y S Bharati), నారా చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) పాత్రలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఈ దర్శకుడు.. జగన్ ని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశాడు. జగన్ తో దాదాపు గంటకు పైగా RGV భేటీ అయ్యాడు. ఈ భేటీలో వ్యూహం సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించినట్లు సమాచారం.
Ram Charan : రామ్ చరణ్‌కి పుట్టబోయే బిడ్డ కోసం కీరవాణి కొడుకు స్పెషల్ ట్యూన్.. ఉపాసన ట్వీట్!
కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో జగన్ పాత్రని ‘అజ్మల్ అమీర్’ పోషిస్తున్నాడు. వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ కనిపించబోతుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే దాని పై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వర్మతో వంగవీటి సినిమా తెరకెక్కించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’తో ఆడియన్స్ ని పలకరించిన వర్మ.. ఈసారి ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలతో ప్రేకక్షుల ముందుకు రాబోతున్నాడు.
![Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/Ram-Gopal-Varma-meets-YS-Jagan-Mohan-Reddy-on-point-of-Vyooham-movie1.jpg)
Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie
![Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/Ram-Gopal-Varma-meets-YS-Jagan-Mohan-Reddy-on-point-of-Vyooham-movie2.jpg)
Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie
![Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/Ram-Gopal-Varma-meets-YS-Jagan-Mohan-Reddy-on-point-of-Vyooham-movie3.jpg)
Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie