ఈ గాంధీని గుర్తుపట్టారా

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండారు. ఎందుకంటే సినిమాలు ఎలాగో హిట్ కావడం లేదని.. ఏదోరకంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటున్నాడు. రీసెంట్ గా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిగా అతని ఫోటోని మార్ఫింగ్ చేసుకుని.. గోపికగా శ్రీదేవిని పెట్టి తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.. అలాగే ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా.. గాంధీలా ఫేస్ మార్ఫింగ్ చేసుకుని సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతేకాదు ఆ ఫోటోను షేర్ చేస్తూ.. వాట్??? నేను అచ్చం గాంధీలా ఉన్నాను. నాలో గాంధీ కనపడుతున్నాడు. హ్యాపి మై జయంతి అంటూ.. పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసిన నెటిజన్లంతా.. ప్లీజ్ గాంధీని అవమానించవద్దంటూ రిప్లై ఇచ్చారు.
WHAATTT??? Never knew I had him in me ??? Happy My Jayanthi??? pic.twitter.com/VdnYT90Gfs
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2019