సూపర్ స్టార్ మహేశ్ – రణవీర్ సింగ్ ఫొటో ఎందుకంత ఫ్యామస్ అయిందంటే..

Mahesh Babu: ప్రజెంట్ జనరేషన్ ఇద్దరు కూలెస్ట్ సూపర్‌స్టార్లు Mahesh Babu, రణవీర్ సింగ్ కలిసి యాక్షన్ గెటప్‌లలో ఉన్న ఫొటో ఎందుకంత వైరల్ అయింది. రెండ్రోజులుగా ట్రెండింగ్‌లో చక్కర్లు కొట్టడానికి వెనుక కారణమేంటి.
రణవీర్ సింగ్, Mahesh Babuలు కోలా బ్రాండ్ కు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఓ కమర్షియల్ యాడ్ కోసం ఆ కంపెనీ ఇద్దరినీ ఒక చోటకు చేర్చింది. ఈ సందర్భంగా రణవీర్.. మహేశ్ గురించి సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టేశాడు.
‘నేను చాలా గొప్ప జెంటిల్‌మ్యాన్ ను కలిశాను. మేం కలిసిన ప్రతిసారి గొప్పగా అనిపిస్తుంది. బిగ్ బ్రదర్ మహేశ్ గారికి ప్రేమ & గౌరవాన్ని తెలియజేస్తున్నాను’ అని పోస్టు పెట్టాడు.
ఈ యాక్షన్ యాడ్‌లో రణవీర్, మహేశ్ లు కలిసి ఓ ఇంపాజిబుల్ టాస్క్ పూర్తి చేసి చివరిదైన కోలా బాటిల్ ను సొంతం చేసుకుంటారు. అంతపెద్ద యాక్షన్ సీన్ ను కూడా కూల్ యాక్షన్ స్టంట్లతో సునాయాసంగా పూర్తి చేసేస్తారు. ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న యాడ్ కావడంతో కచ్చితంగా ఇది చర్చనీయాంశం అవుతుందని భావిస్తుంది మేనేజ్మెంట్.
ఈ కమర్షియల్ యాడ్ ను హిందీతో పాటు తెలుగు భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. ఇండియా వ్యాప్తంగా ఉన్న మహేశ్ ఫ్యాన్ క్రేజ్ , దక్షిణాదిలో రణవీర్‌పై ఉన్న అభిమానాన్ని వాడేసుకోవాలనేది కోలా కంపెనీ ప్లాన్. ఈ యాడ్ గురించి చెప్పకుండా మహేశ్ ఫొటోను పెట్టి కాంప్లిమెంట్ ఇవ్వడంతో అటూ ఇటు అందరికీ నచ్చి తెగ ట్రెండ్ అయిపోతుంది.