Rashmi Gautam: ఒకప్పుడు అవకాశాలు తక్కువ.. ఇప్పుడలా కాదు

తెలుగు బుల్లితెరకి కలరింగ్ తెచ్చి.. ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే యాంకర్ రష్మి తెలుగు లీడింగ్ ఛానెల్స్ లో పలు టీవీషోలతో బిజీబిజీగా గడిపేస్తుంది. అప్పుడప్పుడు రిబ్బన్ కటింగ్స్‌తో కూడా సందడి చేస్తుంటుంది. తాజాగా ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించింది.

Rashmi Gautam: ఒకప్పుడు అవకాశాలు తక్కువ.. ఇప్పుడలా కాదు

Rashmi Gautam

Updated On : August 14, 2021 / 1:43 PM IST

Rashmi Gautam: తెలుగు బుల్లితెరకి కలరింగ్ తెచ్చి.. ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే యాంకర్ రష్మి తెలుగు లీడింగ్ ఛానెల్స్ లో పలు టీవీషోలతో బిజీబిజీగా గడిపేస్తుంది. ఒకపక్క టీవీషోలతో పాటు తనకు తగిన పాత్రలు దొరికితే వెండితెరపై కూడా మెరిసే ఈ హాట్ యాంకర్ కు హీరోయిన్లను మించి ఫాలోయింగ్ ఉంటుంది. దీంతో అప్పుడప్పుడు రిబ్బన్ కటింగ్స్‌తో కూడా సందడి చేస్తుంటుంది. తాజాగా ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించింది.

రష్మీ వస్తున్న విషయం తెలుసుకొని స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో షాపింగ్ మాల్ దగ్గర భారీగా జనం చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రష్మి ఆ జనసందోహంలో కారు దిగేందుకే అరగంట సమయం పట్టిందంటే ఎంత జనం వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఇక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడిన రష్మి, కరోనా థర్డ్ వేవ్ రాకుండా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రష్మీ కొత్తగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చేవారికి కొన్ని సూచనలు చేసింది.

ముందుగా ఏ రంగంలో అవకాశాలు దక్కించుకోవాలన్న కష్టపడాల్సిందేనని చెప్పిన రష్మీ.. సులువుగా ఏదీ రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పింది. ఒకప్పుడు అవకాశాలు తక్కువగా ఉండేదని.. అలాంటి సమయంలో అవకాశం మనకి చేరాలంటే కష్టాలు ఎక్కువగా ఉండేదని.. కానీ ఇప్పుడు అవకాశాలు పెరిగాయి.. సోషల్ మీడియా ద్వారా కూడా అవకాశాలను అందుకోవచ్చని చెప్పింది.