Rashmika Mandanna : యానిమల్ నుంచి పుష్ప సెట్స్‌కి రష్మిక.. తనలోని యానిమల్‌ని చూస్తారు అంటూ పోస్ట్!

రష్మిక ప్రస్తుతం యానిమల్, పుష్ప 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ యానిమల్ షూటింగ్ పూర్తి చేసుకోగా..

Rashmika Mandanna : యానిమల్ నుంచి పుష్ప సెట్స్‌కి రష్మిక.. తనలోని యానిమల్‌ని చూస్తారు అంటూ పోస్ట్!

Rashmika Mandanna completes Animal movie shooting and enters Pushpa 2 sets

Updated On : June 20, 2023 / 4:45 PM IST

Rashmika Mandanna – Pushpa 2 : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. వాటిలో ఒకటి ‘యానిమల్’ (Animal), మరొకటి పుష్ప 2. ఈ రెండు చిత్రాల పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా యానిమల్ సినిమా తెరకెక్కుతుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా.. పక్కా వైల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతుంది.

Alia Bhatt : రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని టీజర్ రిలీజ్.. అదిరేటి శారీల్లో అలియా భట్ అందాలు..

ఈ సినిమాతో వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు దర్శకుడు. ఇటీవల ప్రీ టీజర్ అంటూ రిలీజ్ చేసిన చిన్న టీజర్ వీడియో మూవీ పై మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఆగష్టు 11న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. కాగా రష్మిక ఈ మూవీకి సంబంధించిన షూట్ మొత్తం పూర్తి చేసుకొని నేడు (జూన్ 20) పుష్ప 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలియజేసింది. అలాగే యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. దాదాపు 50రోజుల పాటు ఆ మూవీ షూటింగ్ లో పాల్గొన్నట్లు, నిన్న నైట్ తో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

Pooja Hegde : గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే అవుట్.. కారణం అదేనట!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యాక్టర్స్ కి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి తనకి కావాల్సిన అవుట్ ఫుట్ ని తీసుకుంటారని, అలాగే ఈ సినిమాలో తనలోని యానిమల్ ని కూడా బయట పెట్టాడని చెప్పుకొచ్చింది. రణ్‌బీర్ యాక్షన్, మూవీలోని యాక్షన్ ఆడియన్స్ అంచనాలకు మించి ఉంటుందని వెల్లడించింది. తనని యానిమల్ మూవీ కోసం సెలెక్ట్ చేసుకున్నందుకు చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ఈరోజు నుంచి పూర్తిగా పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనబోతుంది.

Rashmika Mandanna completes Animal movie shooting and enters Pushpa 2 sets

Rashmika Mandanna completes Animal movie shooting and enters Pushpa 2 sets