Raviteja : రవితేజ ‘ఇరుముడి’.. రీమేక్ సినిమానా? ఆ రెండు మలయాళం సినిమాలు కలిపి..?

రవితేజ హీరోగా ఇరుముడి అనే కొత్త సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.(Raviteja)

Raviteja : రవితేజ ‘ఇరుముడి’.. రీమేక్ సినిమానా? ఆ రెండు మలయాళం సినిమాలు కలిపి..?

Raviteja

Updated On : January 26, 2026 / 3:09 PM IST
  • రవితేజ కొత్త సినిమా
  • శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి టైటిల్ తో
  • మలయాళం రీమేక్ అంటూ సందేహాలు

Raviteja : గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్న రవితేజ ఇటీవల సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. నేడే రవితేజ పుట్టిన రోజు కావడంతో తన కొత్త సినిమాని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఇరుముడి అనే కొత్త సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.(Raviteja)

ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ అయ్యప్ప దీక్షలో నెత్తి మీద ఇరుముడి పెట్టుకొని ఓ చిన్నారిని ఎత్తుకున్నట్టు ఉంది. మాస్ మహారాజ రవితేజ ఒకేసారి ఈ అవతారంలో కనిపించడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Also Read : Ritika Nayak : షాప్ ఓపెనింగ్ లో సందడి చేసిన రితిక నాయక్..

అయితే ఈ సినిమా రీమేక్ అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా 2022 లో మాలికాపురం అనే సినిమా వచ్చింది. ఇద్దరు చిన్నారులు అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలలో అయ్యప్పను దర్శించడం ఇందుకు సహకరించిన హీరో కథతో వచ్చిన మాలికాపురం సినిమా పెద్ద విజయం సాధించింది. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ రావడంతో ఇక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది.

దీంతో రవితేజ ఇరుముడి సినిమా ఈ మాలికాపురం సినిమాకు రీమేక్ అని సందేహం వ్యక్తపరుస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల శివ నిర్వాణ రవితేజతో హారర్ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరుముడి సినిమా మలయాళంలో 2022 లో వచ్చిన కుమారి సినిమా రీమేక్ అని కూడా అంటున్నారు పలువురు. హారర్ ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన కుమారి సినిమా కూడా అక్కడ మంచి విజయం సాధించింది.

Also See : గణతంత్ర వేడుకల్లో సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొన్న పవన్.. ఫొటోలు

ఆ హారర్ ఫాంటసీతో పాటు అయ్యప్ప దీక్షను కలిపి శివ నిర్వాణ తండ్రి కూతురు ఎమోషన్ తో ఈ సినిమాని సరికొత్తగా తెరకెక్కిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఇది రీమేక్ సినిమానా? లేక ఏదైనా కొత్త కథేనా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఈ సినిమా గురించి రవితేజ, జీవి ప్రకాష్ గొప్పగా పొగుడుతూ ట్వీట్స్ చేసారు. 2026 లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.