Dasari Kiran Kumar : ఆర్జీవీ ‘వ్యూహం’ నిర్మాతకు జగన్ సర్కారులో పదవి..
వివాదాలకు కేంద్రబిందువు అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'వ్యూహం' సినిమా ప్రకటించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక ఊపు ఊపేసాడు. వర్మతో 'వంగవీటి' తెరకెక్కించిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్మాతకు తన సర్కారులో పదవిని అప్పగించాడు.

RGV Vyuham producer gets a post in AP government
Dasari Kiran Kumar : వివాదాలకు కేంద్రబిందువు అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక సినిమా ప్రకటించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక ఊపు ఊపేసాడు. ‘వ్యూహం’, ‘శపథం’ అంటూ రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలు.. ఏపీ లోని పలువురు రాజకీయ నాయకులని, పార్టీలని టార్గెట్ చేస్తూ ఉంటుంది అని తెలుస్తుంది. కాగా వర్మతో ‘వంగవీటి’ తెరకెక్కించిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాలను నిర్మిస్తున్నాడు.
RGV : అషు రెడ్డి పాదాలను ముద్దాడుతున్న RGV.. వైరల్ అవుతున్న వీడియో..
తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్మాతకు తన సర్కారులో పదవిని అప్పగించాడు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. 24 మంది బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. దీంతో సీఎం జగన్ తెలుగు చిత్ర పరిశ్రమకి కూడా టీటీడీ బోర్డులో ప్రాతినిధ్యం వహించే అవకాశం కలిపించాడు.
కాగా ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, ఎంపీ బాలశౌరి గారికి, ఎంపీ వై వి సుబ్బారెడ్డి గారికి దాసరి కిరణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. “నేను జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిని. ఈ నియామకంతో విధేయుడికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు జగన్” అంటూ దాసరి కిరణ్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ సమయంలో సీఎం జగన్, నిర్మాత దాసరికి ఈ పదవిని అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.