Rithu Chowdary : రీతూ చౌదరికి బ్రేకప్ అవ్వలేదా? శ్రీకాంత్ తో మళ్లీ ప్యాచప్? ప్రేమ, పెళ్లి వద్దని ఇప్పుడేంటి ఇలా?

రీతూ స్వయంగా సోషల్ మీడియాలో లవ్, పెళ్లి గురించి పలువురు అడుగుతున్నారని.. పెళ్లి చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, అమ్మో పెళ్లా?, ఎవర్ని లవ్ చెయ్యట్లేదు, నాతో నేనే లవ్ లో ఉన్నాను అంటూ సమాధానాలిచ్చింది.

Rithu Chowdary : రీతూ చౌదరికి బ్రేకప్ అవ్వలేదా? శ్రీకాంత్ తో మళ్లీ ప్యాచప్? ప్రేమ, పెళ్లి వద్దని ఇప్పుడేంటి ఇలా?

Rithu Chowdary patch up with her boyfriend again shares photos with srikanth

Updated On : August 23, 2023 / 7:08 AM IST

Rithu Chowdary : సీరియల్స్(Serials) తో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్(Jabardasth), యూట్యూబ్(You Tube) వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రీల్స్, హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. కొన్నాళ్ల క్రితం రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ తనే నా ఫియాన్సీ, త్వరలో పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది. అతను హైదరాబాద్ కి చెందిన ఓ పొలిటీషియన్ ఫ్యామిలీ అబ్బాయి అని, బిజినెస్ మెన్ అని సమాచారం.

అయితే ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. రీతూ స్వయంగా సోషల్ మీడియాలో లవ్, పెళ్లి గురించి పలువురు అడుగుతున్నారని.. పెళ్లి చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, అమ్మో పెళ్లా?, ఎవర్ని లవ్ చెయ్యట్లేదు, నాతో నేనే లవ్ లో ఉన్నాను అంటూ సమాధానాలిచ్చింది. దీంతో రీతూ చౌదరి ఫియాన్సీకి బ్రేకప్ చెప్పింది, వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు అని అంతా భావించారు. కానీ ఇంతలో మళ్లీ శ్రీకాంత్ తో ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంది రీతూ.

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ఉందా? చిత్రయూనిట్ ఏం చెప్పారో చూడండి..

రీతూ చౌదరి తన సోషల్ మీడియాలో శ్రీకాంత్ తో ఉన్న ఫొటోలు ఇప్పుడు మళ్లీ షేర్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వీళ్లిద్దరికీ బ్రేకప్ అవ్వలేదా? మళ్లీ ప్యాచప్ అయిపోయారా? మరి ఇన్ని రోజులు పెళ్లి వద్దు, ప్రేమ లేదు అని హడావిడి ఎందుకు చేసింది? మళ్లీ ఇప్పుడు ఇద్దరివీ క్లోజ్ గా ఉన్న ఫొటోలు ఎందుకు పెడుతుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రీతూ ఇలా ఎందుకు చేసింది ఈ అమ్మడికి తెలియాలి. త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారేమో చూడాలి.