బాహుబలిని మించిపోయింది : 10 వేల స్క్రీన్స్‌లో సాహో

భారతదేశంలో 10 వేల స్క్రీన్స్‌లో సందడి చెయ్యబోతున్న సాహో..

  • Published By: sekhar ,Published On : August 27, 2019 / 09:47 AM IST
బాహుబలిని మించిపోయింది : 10 వేల స్క్రీన్స్‌లో సాహో

Updated On : May 28, 2020 / 3:44 PM IST

భారతదేశంలో 10 వేల స్క్రీన్స్‌లో సందడి చెయ్యబోతున్న సాహో..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన  మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. మరో మూడు రోజుల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా టికెట్స్ హాట్ కేక్స్‌లా అయిపోతున్నాయి. ఏపీ ప్రభుత్వం అదనంగా మరో రెండు షోలకు పర్మిషన్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 29 అర్థరాత్రి షోలు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సాహో ఇండియా వైడ్ 10 వేల స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఏపీ, తెలంగాణాలో 2 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ అవనుంది. బాలీవుడ్‌తో పాటు మిగతా చోట్ల కూడా అత్యధిక ధియేటర్స్ సాహోకే కేటాయించారు. బాహుబలి : ది కన్‌క్లూజన్ 9 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ అవ్వగా సాహో అదనంగా మరో వెయ్యి ధియేటర్లలో విడుదల అవుతోంది.

Read Also : సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ‘దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్’ – 2019..

రిలీజ్ పరంగా రజినీ కాంత్ 2.ఓ రికార్డ్‌ను సాహో క్రాస్ చేసిందని సినీ పండితులు చెప్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఆగస్టు 30న సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : మది, ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ : కమల్ కణ్ణన్.

Image