Vijayawada : దుర్గమ్మ సన్నిధిలో సాయిధరమ్ తేజ్.. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి బయటకు..
తాజాగా ప్రమాదం తర్వాత కోలుకున్నాక మొదటి సారి బయటకి వచ్చారు సాయి ధరమ్ తేజ్. హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన......

Sai Dharam Tej
Sai Dharam Tej : గత కొన్ని నెలల క్రితం హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. మేజర్ యాక్సిడెంట్ అవ్వడంతో ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి రెండు నెలలకు పైగానే పట్టింది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా బయటకి రాలేదు. ఇటీవలే తాను పూర్తిగా రికవర్ అయ్యానని తెలిపాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంపై మరింత శ్రద్ద తీసుకుంటున్నాడు.
Naresh : కోట్లలో మోసం.. మాజీ భార్యపై పోలీసు కేసు.. నాకేం సంబంధం లేదు అంటున్న నరేష్..
తాజాగా ఆ ప్రమాదం తర్వాత కోలుకున్నాక మొదటి సారి బయటకి వచ్చారు సాయి ధరమ్ తేజ్. హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. సాయి ధరమ్ తేజ్ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, శేషవ్రస్తాలను అందచేశారు.