Pan India Movies : సెప్టెంబర్‌లో పాన్ ఇండియా మూవీస్ హవా.. మూవీ లవర్స్‌కి పండగే..

ఈ సెప్టెంబర్ మూవీ లవర్స్ కి పండుగ కానుంది. ఆ నెలలో మొత్తం 4 పాన్ ఇండియా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

Pan India Movies : సెప్టెంబర్‌లో పాన్ ఇండియా మూవీస్ హవా.. మూవీ లవర్స్‌కి పండగే..

Salaar Kushi BoyapatiRapo Jawan released in september

Updated On : June 23, 2023 / 12:29 PM IST

Pan India Movies : ఈ సెప్టెంబర్ లో 4 పాన్ ఇండియా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అది కూడా వారం గ్యాప్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మొదటిగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ అండ్ సమంత కలిసి నటిస్తున్న సినిమా ఖుషి (Kushi). లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ పై విజయ్ అండ్ సామ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

Jabardasth Santhi Kumar : డైరెక్టర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్.. సాయికుమార్‌తో ఎమోషనల్ సినిమా..

ఈ సినిమా వచ్చిన 6 రోజులకు (సెప్టెంబర్ 7) షారుఖ్ ఖాన్ జవాన్ (Jawan) సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళ్ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రలు చేస్తుంటే.. తమిళ్ హీరో విజయ్ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం తరువాత సెప్టెంబర్ 15న రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రంతో రామ్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.

RGV : నన్ను పార్టీలోకి రమ్మన్నారు, పోటీ చేయమన్నారు.. కానీ.. పొలిటికల్ ఎంట్రీపై ఆర్జీవీ వ్యాఖ్యలు..

ఇక చివరిగా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ (Salaar) తో సెప్టెంబర్ ని గ్రాండ్ గా ముగించనున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ టీజర్ ని జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ 4 పాన్ ఇండియా చిత్రాల్లో 3 టాలీవుడ్ నుంచి వస్తుండడం విశేషం. మరి వీటిలో బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.