ట్రెండింగ్‌లో సమంత న్యూ ఇయర్ రింగ్స్..

సమంత అక్కినేని ఈ లాక్‌డౌన్ టైంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. ఇంట్లోనే వ్యవసాయం చేస్తూ ఆ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకున్నాయి. రానా పెళ్లిలో సామ్ ధరించిన డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
తాజాగా సామ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన న్యూ ఇయర్ రింగ్స్ పిక్ తెగ ట్రెండ్ అవ్వడమే కాక యువతులును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వీటిలో సమంత ఏకంగా ఐదు చిన్న చిన్న చెవి దుద్దులు ధరించారు. డైమండ్, ఇతర మెటల్స్‌తో తయారు చేసిన ఈ స్మాల్ స్టడ్స్ యువతులను తెగ ఆకర్షిస్తున్నాయి. ‘New Piercings’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ‘సూపర్బ్.. ఫ్యాషన్‌లో మీకు మీరే సాటి’ అంటూ కామెంట్ చేస్తున్నారు సామ్ ఫ్యాన్స్, నెటిజన్స్.
https://www.instagram.com/p/CEBT7t7BmkU/?utm_source=ig_web_copy_link