Samantha : అమ్మతో అమెరికాకు సమంత.. చికిత్స కోసం కాదట.. మరీ ఎందుకు వెళ్లిదంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత (Samantha) ఒకరు. అందం, అభినయం ఆమె సొంతం. గత కొన్నాళ్లుగా ఆమె మయోసైటిస్ వ్యాధితో పోరాడుతోంది.

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత (Samantha) ఒకరు. అందం, అభినయం ఆమె సొంతం. గత కొన్నాళ్లుగా ఆమె మయోసైటిస్ వ్యాధితో పోరాడుతోంది. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వాలని ఆమె బావిస్తోంది. ఇందుకోసం సిటాడెట్ వెబ్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషీ సినిమా షూటింగ్‌ను ఆమె పూర్తి చేసింది. ఆమె కొత్తగా ఎటువంటి చిత్రాలను కూడా ఒప్పుకోలేదు.
సమంత త్వరలోనే మయోసైటిస్ చికిత్స కోసం త్వరలోనే అమెరికా వెళ్లనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి పూర్తిగా కోలుకున్న తరువాతనే ఆమె ఇండియాకు వస్తుందని ఆ వార్తల సారాంశం. ఇక ఖుషీ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ఇటీవల మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఇందులో సమంత పాల్గొంది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, సమంత లు చేసిన డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jailer Collections : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సూపర్ స్టార్.. 10 రోజుల్లో 500 కోట్లు..
మ్యూజికల్ కాన్సర్ట్ అయిపోగానే సామ్.. తన తల్లితో కలిసి హడావుడిగా అమెరికా విమానం ఎక్కింది. సమంత ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంత తన తల్లితో కలిసి నడిచి వెలుతుండడాన్ని చూడొచ్చు. అభిమానులతో ఆమె సెల్ఫీలు దిగింది. అయితే.. సామ్ అమెరికా వెళ్లింది చికిత్స కోసం కాదని అంటున్నారు ఆమె సన్నిహితులు.
Our cutie with mom off to New York ????
Happy safe journey Sammy❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/bk0svKb7zS— RoshSam? (@RoshSamLover) August 18, 2023
మరి ఎందుకు వెళ్లిందని అడిగితే.. న్యూయార్క్ నగరంలో ఈ నెల 20న జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమంత వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ వేడుకలకు సమంతతో పాటు నటుడు రవికిషన్, నటి జాక్వైలిస్ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందింది.
ఇదిలా ఉంటే.. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అమెరికాకు వెళ్లిన సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఓ ఫోటోలో ఎత్తైన భవనాలను ఉన్నాయి. దీనికి ఐ మిస్ యూ అని రాసుకొచ్చింది.

samatha insta post
మరో ఫోటోలో Sparkling water ఉన్న గ్లాస్‌ను చేతితో పట్టుకుని ఉంది. కొత్త ప్రేమ దొరికింది.. కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అంటూ రాసుకొచ్చింది.

samatha insta post