Krishnamma : ‘సింహాద్రి’ రిఫరెన్స్‌తో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’.. రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమాలో ఎన్టీఆర్ సింహాద్రి సినిమా రిఫరెన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Krishnamma : ‘సింహాద్రి’ రిఫరెన్స్‌తో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’.. రిలీజ్ ఎప్పుడంటే..

Satyadev Krishnamma Movie Reference with NTR Simhadri Releasing Date Announced

Updated On : April 5, 2024 / 4:26 PM IST

Krishnamma : జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. చివరిసారిగా సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాతో 2022లో పలకరించాడు. ఆ సినిమా ఆశించినంత ఫలితం సాధించలేదు. ఆ తర్వాత నాలుగు సినిమాలు ప్రకటించినా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు.

తాజాగా సత్యదేవ్ తన నెక్స్ట్ సినిమా ‘కృష్ణమ్మ’ రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. గతంలోనే కృష్ణమ్మ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ చాలా వైలెంట్ గా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ జైలు నుంచి విడుదల అవ్వడానికి సిద్ధమైనట్టు ఈ గ్లింప్స్ లో చూపించారు. ఈ సినిమాని మే 3న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్.

Also Read : Varsha Dsouza : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఈ యూట్యూబర్ ఉంది గుర్తుపట్టారా?

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సింహాద్రి సినిమా రిఫరెన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్లో ఆల్రెడీ సింహాద్రి రిఫరెన్స్ చూపించారు. ఇప్పుడు గ్లింప్స్ చివర్లో ఓ పోస్టర్ కూడా చూపించగా అందులో సింహాద్రి సినిమా రిలీజ్ అప్పుడు ఎన్టీఆర్ కటౌట్ సత్యదేవ్ వెనక ఉన్నట్టు చూపించారు. దీంతో ఈ కథ 2003లో సింహాద్రి రిలీజ్ టైంలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషిస్తున్నారు. కృష్ణమ్మ సినిమాలో సింహాద్రి సినిమా అప్పటి హంగామాని ఎలా చూపిస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విజయవాడ కృష్ణా నది ఒడ్డున జరిగిన ఓ రివెంజ్ యాక్షన్ లా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని కొరటాల శివ రిలీజ్ చేస్తుండటం విశేషం.