Shriya Saran : హైదరాబాద్‌లో శ్రియ సందడి..

శ్రియ బాలీవుడ్ యాక్టర్ షర్మాన్ జోషితో కలిసి ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చేస్తుంది..

Shriya Saran : హైదరాబాద్‌లో శ్రియ సందడి..

Shriya Saran

Updated On : January 25, 2022 / 7:38 PM IST

Shriya Saran: శ్రియ.. 2001లో ‘ఇష్టం’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. తక్కువ టైంలోనే సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్‌ స్టర్స్‌తో కూడా యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒకానొక టైంలో అవకాశాలు తగ్గినా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

Shriya Saran: సీక్రెట్‌గా బిడ్డకు జన్మనిచ్చేసిన హీరోయిన్ శ్రియ.. ఏడాది క్రితమే!

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవల ‘గమనం’ మూవీలో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ లో అజయ్ దేవ్‌గణ్ భార్యగా నటించింది. తమిళ్‌లోనూ రెండు సినిమాలు చేస్తుంది. రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ (Andrei Koscheev) ని పెళ్లాడి ఓ పాపకు జన్మనిచ్చింది శ్రియ. పాపకి రాధ అనే పేరు పెట్టారు.

Shriya Saran New Movie

 

ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్ షర్మాన్ జోషితో కలిసి ‘మ్యూజిక్ స్కూల్’ అనే సినిమా చేస్తుంది. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, సీనియర్ నటి సుహాసిని ములాయ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది.

Rakul Preet Singh : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రకుల్ రిక్వెస్ట్..