Siddhu Jonnalagadda : ఆరోజు హెల్మెట్‌ లేకుంటే.. ఇప్పుడిలా హీరోగా కనిపించేవాడిని కాదు..

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ.. తన లైఫ్ లో జరిగిన కొన్ని ప్రమాదకర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Siddhu Jonnalagadda : ఆరోజు హెల్మెట్‌ లేకుంటే.. ఇప్పుడిలా హీరోగా కనిపించేవాడిని కాదు..

Siddhu Jonnalagadda shares his bad incidents in his past life

Updated On : February 13, 2024 / 9:25 PM IST

Siddhu Jonnalagadda : టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, తన స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో ప్రెజెంట్ జనరేషన్ కి యూత్ ఐకాన్ అయ్యిపోయారు. ఇక ఈ యూత్ ఐకాన్ తో యువతలో బైక్ యాక్సిడెంట్స్ పై అవగాహన తెప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారు. ఈక్రమంలోనే రోడ్డు భద్రతపై జరిగిన అవగాహన కార్యక్రమంలో సిద్దు అతిథిగా పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో సిద్దు తన లైఫ్ లో జరిగిన కొన్ని ప్రమాదకర విషయాలను అందరితో పంచుకున్నారు. తాను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో పరీక్ష రాసి బైక్ పై వస్తుండగా.. ఫ్రెండ్ సిద్దు బైక్ ని ఓవర్ టేక్ చేస్తూ యాక్సిడెంట్ గురయ్యాడట. దీంతో రెండు బైక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఆ సమయంలో సిద్దుకి ఉన్న హెల్మెట్ కూడా పగిలిపోయిందట. కానీ దాని వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నారట.

Also read : Rashmika Mandanna : వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటంటున్న రష్మిక.. ఎవరినో తెలుసా..?

ఆ తరువాత కొన్నేళ్ల క్రిందట రాజమండ్రి నుంచి కారులో వస్తున్న సమయంలో ఒక బైక్ అతను సడన్ గా అడ్డురావడంతో.. సిద్దు కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ కొట్టాడట. దీంతో కారు స్కిడ్ అయ్యి ఉల్టా పడిపోయిందట. ఆ సమయంలో కూడా గట్టి ప్రమాదమే జరగాల్సి ఉందట. కానీ అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకోవడంతో.. చిన్ని చిన్ని గాయాలతో ప్రమాదం నుంచి బయట పడినట్లు చెప్పుకొచ్చారు.

తన లైఫ్ లో తనకి రెండు ఛాన్సులు వచ్చాయని, అందరి జీవితాల్లో ఇలా సెకండ్ ఛాన్స్ ఉండకపోవచ్చని, అందుకనే హెల్మెట్, సీట్ బెల్ట్ అనేవి పాటించండి అంటూ సిద్దు చెప్పుకొచ్చారు. సిద్దు మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కాగా సిద్దు నటిస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మార్చిలో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీ ట్రైలర్ ని రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం పై ఆడియన్స్ లో మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.