ఘనంగా సిరివెన్నెల కొడుకు రాజా చెంబోలు వివాహం

  • Published By: sekhar ,Published On : November 1, 2020 / 04:54 PM IST
ఘనంగా సిరివెన్నెల కొడుకు రాజా చెంబోలు వివాహం

Updated On : November 1, 2020 / 6:37 PM IST

Chembolu Wedding: సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా చెంబోలు ( రాజా భవాని శంకర శర్మ) వివాహం వెంకటలక్ష్మి హిమబిందుతో శనివారం ఉదయం హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో 10 గంటల 55 నిమిషాలకు జరిగింది.


ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.


‘ఫిదా, ఎవడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అంత‌రిక్షం’ వంటి పలు సినిమాలతో రాజా చెంబోలు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Image

ImageImage

Image

Image