సీత ఫస్ట్ లుక్
రిపబ్లిక్ డే సందర్భంగా సీత ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.

రిపబ్లిక్ డే సందర్భంగా సీత ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.
తేజ డైరెక్షన్‌లో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమాకి సీత అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, నిన్న టైటిల్ లోగో లాంచ్ చేసిన మూవీ యూనిట్, రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. వాకీ రైడ్ విత్ ఫ్రీకీ కపుల్.. అంటూ రిలీజ్ చేసిన సీత ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రీనివాస్ పెద్దగా అరుస్తుండగా, కాజల్ అతణ్ణి చూసి భయంతో నోరు తెరిచి చూస్తుంది. ఈ సినిమాలో కాజల్‌ది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తుంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ చేస్తున్న సినిమా ఇదే.
తేజ డైరెక్షన్‌లో కాజల్‌కిది మూడవ సినిమా, శ్రీనివాస్‌తో రెండవ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత సినిమాకి సంగీతం : అనూప్ రూబెన్స్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, రచన : పరుచూరి బ్రదర్స్, లక్ష్మీ భూపాల, ఫైట్స్ : కణల్ కణ్ణన్.