Sonal Chauhan: సోనాల్ అందాల జాతర.. హీట్ పుట్టిస్తున్న ఫోటో షూట్!

తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ మాత్రం కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మాత్రం..

Sonal Chauhan: సోనాల్ అందాల జాతర.. హీట్ పుట్టిస్తున్న ఫోటో షూట్!

Sonal Chauhan (Image:Instagram)

Updated On : August 26, 2021 / 5:41 PM IST

Sonal Chauhan: తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ మాత్రం కాలేకపోయింది సోనాల్ చౌహన్.


బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మాత్రం మారనేలేదు.


ముందుగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సోనాల్ అక్కడ నుండి హైదరాబాద్ వచ్చింది. అయితే.. ఇక్కడ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది.


కానీ.. రెండుచోట్లా సక్సెస్ కాలేకపోయింది. టాలీవుడ్ లో రెయిన్ బో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సోనాల్.. లెజెండ్, పండగచేస్కో, షేర్, డిక్టేటర్, రూలర్ సినిమాలతో పాటు అనుష్క సైజ్ జీరోలో కూడా కనిపించింది.


చేసిన అరడజను సినిమాలలో మూడు బాలకృష్ణతోనే చేయగా రామ్ లాంటి యంగ్ హీరోతో కలిసి నటించినా మిగతా కుర్ర హీరోల సినిమాలలో అవకాశాలు పట్టలేకపోయింది.


అనుకున్న స్థాయిలో సినిమాలతో స్టార్ కాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోలకు లేని ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.


వీలున్నప్పుడల్లా విదేశీ బీచ్‌లలో బికినీలతో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొట్టే సోనాల్ తాజాగా ఇన్ డోర్ లో కూడా లోదుస్తులతో ఫోజులిచ్చి కుర్రకారును రెచ్చగెట్టింది.


ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంటపెడుతున్నాయి. మరి అమ్మడి ఈ డెడికేషన్ చూసైనా మరికొన్ని అవకాశాలు వస్తాయో లేదో పాపం.