Salman Khan – Sooraj Pancholi : జియా ఖాన్ కేసు.. సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడు.. సూరజ్ పంచోలి!
జియా ఖాన్ ఆత్మహత్య కేసు నుంచి బయటపడ్డ సూరజ్ పంచోలి.. సల్మాన్ ఖాన్ తనకి అండగా నిలిచినట్లు చెప్పుకొచ్చాడు. CBI కోర్ట్ నుంచి బయటకి రాగానే తనకి సల్మాన్..

Sooraj Pancholi says Salman Khan gaves moral support on Jiah Khan case
Salman Khan – Sooraj Pancholi : 2013లో జరిగిన బాలీవుడ్ నటి జియా ఖాన్ (Jiah Khan) ఆత్మహత్య కేసు CBI తీర్పుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సరసన నిశ్శబ్ద్ అనే సినిమాలో నటించి బాలీవుడ్ కి పరిచయం అయిన జియా ఖాన్ ఆత్మహత్య చేసుకోడానికి కారణం ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి అని సూసైడ్ నోట్ ద్వారా తెలియజేసింది. వారిద్దరూ ప్రేమించుకున్నారని, సూరజ్ ఆమెను వేధిస్తుండడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు జియా నోట్ లో పేర్కొంది.
Salman Khan : తండ్రి కావాలనుకుంటున్నా.. పెళ్లి పై సల్మాన్ కామెంట్స్..
ఇక ఆ నోట్ తో అప్పటిలో పోలీసులు సూరజ్ ని అరెస్ట్ చేశారు. నెల పాటు జైలులో ఉన్న సూరజ్ కొన్ని షరతులతో కూడిన బెయిల్ తో బయటకి వచ్చాడు. అయితే జియా ఖాన్ తల్లి కోరిక మేరకు ఆ కేసు CBI కి వెళ్లడంతో అప్పటి నుంచి సూరజ్ ప్రాబ్లెమ్స్ ఎగురుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనకి అండగా నిలిచాడు అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సల్మాన్ ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) సినిమాకి సూరత్ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు.. సూరత్ హీరోగా చేసే మొదటి సినిమాని తానే నిర్మిస్తానంటూ సల్మాన్ మాట ఇచ్చాడట.
Priyanka Chopra Citadel : వరల్డ్ టాప్ వెబ్ సిరీస్‌గా ప్రియాంక సిటాడెల్.. సమంత ఏమి చేస్తుందో?
జియా ఖాన్ కేసులో నేను ఆరోపణలు ఎదురుకుంటున్న సమయంలో నాతో 2015 ‘హీరో’ సినిమాని నిర్మించి తనకి అండగా నిలిచినట్లు చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రులకు మంచి స్నేహితుడని, అతనిని వందసార్లు కలుసుకున్నట్లు, తన కోసం సల్మాన్ అందరికంటే ఎక్కువ చేశాడని చెప్పుకొచ్చాడు. కానీ ఎప్పుడు తన పరిమితులు దాటి ఆ బంధాన్ని ఉపయోగించుకోలేదని తెలియజేశాడు. CBI కోర్ట్ నుంచి బయటకి రాగానే నాకు మొదటి మెసేజ్ సల్మాన్ నుంచి వచ్చింది. “నువ్వు ఏ తప్పు చేయలేదని నీ హృదయంలో ఉంటే, నువ్వు దేనికి చింతించాల్సిన పని లేదు” అంటూ సల్మాన్ మెసేజ్ చేసినట్లు వెల్లడించాడు.