సౌత్ సూపర్ స్టార్ విజయ్ షర్ట్ విప్పాడు… ఇండియా మొత్తం వైరల్ అయ్యాడు….

  • Published By: sreehari ,Published On : August 7, 2020 / 06:36 PM IST
సౌత్ సూపర్ స్టార్ విజయ్ షర్ట్ విప్పాడు… ఇండియా మొత్తం వైరల్ అయ్యాడు….

Updated On : August 7, 2020 / 6:53 PM IST

సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ షర్ట్ విప్పాడు.. ఇండియా మొత్తం వైరల్ అవుతున్నాడు. అర్జున్ రెడ్డితో ఫుల్ పాపులర్ అయిన విజయ దేవరకొండకు ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. అప్పటినుంచి వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. గీతా గోవిందం, కామ్రెడ్ మూవీలతో అభిమానులను మెప్పించిన విజయ్… ఇప్పుడు సరికొత్త లుక్‌తో ఇంటర్నెట్ షేక్ చేస్తున్నాడు..



చొక్కా లేకుండా దిగిన ఓ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్క ‘అకా’తో కలిసి దిగిన ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఇండియా మొత్తం వైరల్ అవుతోంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఫొటో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 2,020,899 లైక్స్ వచ్చాయి. వైరల్ అయిన విజయ్ దేవరకొండ ఫొటో.. సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ 2011 లో విడుదలైన నువిలా మూవీతో సినీరంగ ప్రవేశం చేశారు. 2015లో యెవాడే సుబ్రమణ్యం వచ్చింది.

 

View this post on Instagram

 

My Cute Beast ❤️

A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on


అతను 2016 రొమాంటిక్ కామెడీ పెళ్లి చూపులుతో తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు 2017లో విజయ్ దేవరకొండ సందీప్ వంగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తన పాపులరిటీ పెరిగిపోయింది.



ఈ మూవీ అతనికి అపారమైన విజయం, గుర్తింపును తెచ్చిపెట్టింది. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. మహానటి, గీతా గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాల్లో నటించారు. ఫోర్బ్స్ ఇండియా వారి 30 అండర్ 30 జాబితాలో 2019లో చోటు దక్కించుకున్నాడు. చివరిసారిగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో నటించాడు. ఆ తర్వాత పూరి జగన్నాధ్‌ కాంబినేషన్‌లో మరో కొత్త మూవీతో ముందుకు వస్తున్నాడు…