Sreeleela : భగవంత్ కేసరి టైంలో మెడిసిన్ ఎగ్జామ్స్.. బాలయ్యతో మెడికల్ సబ్జెక్ట్ డిస్కషన్..
శ్రీలీల ఇటీవలే మెడిసిన్ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసినట్టు సమాచారం. ఓ పక్క సినిమాలు, ఓ పక్క చదువుతో బాగా కష్టపడుతుంది శ్రీలీల. భగవంత్ కేసరి షూటింగ్ సమయంలో శ్రీలీలకి మెడిసిన్ ఎగ్జామ్స్ జరిగాయని తెలిపింది.

Sreeleela Discussed Medicine Subjects with Balakrishna in Bhagavanth kesari Shooting
Sreeleela : ప్రస్తుతం శ్రీలీల ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో వరుస షూటింగ్స్ తో, ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే మరోపక్క మెడిసిన్ చదువుకుంటుంది. శ్రీలీల భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. ఈ సినిమాలో బాలయ్య(Balakrishna) కూతురి పాత్రలో నటించింది శ్రీలీల. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల తాజాగా మీడియాతో మాట్లాడగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
శ్రీలీల ఇటీవలే మెడిసిన్ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసినట్టు సమాచారం. ఓ పక్క సినిమాలు, ఓ పక్క చదువుతో బాగా కష్టపడుతుంది శ్రీలీల. భగవంత్ కేసరి షూటింగ్ సమయంలో శ్రీలీలకి మెడిసిన్ ఎగ్జామ్స్ జరిగాయని తెలిపింది.
Also Read : Vijay : విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చిన తమిళనాడు గవర్నమెంట్.. అలాంటి ఫ్యాన్స్ పై కఠిన చర్యలు..
శ్రీలీల మాట్లాడుతూ.. భగవంత్ కేసరి సినిమా సమయంలో నాకు మెడిసిన్ ఎగ్జామ్స్ జరిగాయి. ఎగ్జామ్స్ రాసొచ్చాక బాలకృష్ణ గారు నేను రాసిన సబ్జెక్ట్ పై చాలా నాలెడ్జ్ తో మాట్లాడేవారు. ఆయనకు సినిమాలే కాదు చాలా రంగాలలో పట్టు ఉంది. బాలకృష్ణ గారు అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. ఈయన మెడిసిన్ చేయలేదు కదా ఇంత నాలెడ్జ్ ఎక్కడిది అని ఆశ్చర్యపోయేవాడిని. అలాగే నా దగ్గర ఎప్పుడూ మెడికల్ కిట్ ఉండేది. షూటింగ్ సమయంలో నేను వైద్యం కూడా చేసాను అని తెలిపింది.