Nithiin – Teja Sajja : టాలీవుడ్ మల్టీవర్స్.. హనుమంతుతో అంజి..

టాలీవుడ్ మల్టీవర్స్ సెట్ కాబోతుందా..? హనుమంతుతో అంజి ఫోటోలు వైరల్.

Nithiin – Teja Sajja : టాలీవుడ్ మల్టీవర్స్.. హనుమంతుతో అంజి..

Sri Anjaneyam star Nithiin Hanuman movie Hero Teja Sajja in one frame

Updated On : February 16, 2024 / 12:38 PM IST

Nithiin – Teja Sajja : టాలీవుడ్ లో కూడా సినిమాటిక్ యూనివర్స్‌లు క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా తెలుగు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్’ మూవీతో ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ కి తెర లేపారు. సంక్రాంతికి రిలీజైన హనుమాన్ మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ సూపర్ హీరో యూనివర్స్ లో రాబోయే తదుపరి చిత్రాలు పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఆ యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయంటూ ప్రశాంత్ వర్మ తెలియజేసారు. దీంతో ఆ 12 చిత్రాల్లో ఏ హీరోలు సూపర్ హీరోలుగా కనిపించబోతున్నారు అనేది అందరిలో ఆసక్తిగా మారింది. ఇది ఇలా ఉంటే, తేజ సజ్జ, నితిన్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ఇద్దరు హనుమాన్ రిఫరెన్స్ మూవీలో నటించారు.

Also read : Rajadhani Files : ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనకు.. తొలగిన అడ్డంకులు..

2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీఆంజనేయం’. ఆ సమయంలో కృష్ణవంశీ ఆ మూవీలో చూపించిన గ్రాఫిక్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. సినిమా ప్రేక్షకులను అలరించినప్పటికీ.. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇటీవల హనుమాన్ మూవీ చూసిన తరువాత చాలామంది ఆడియన్స్.. శ్రీఆంజనేయం సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే సూపర్ హిట్ అయ్యేదని కామెంట్స్ చేశారు.

దీంతో ఆ సినిమా చూడని ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా ఇటీవల శ్రీఆంజనేయం చూశారు. ఇక ఇలాంటి సమయంలో హనుమాన్ మూవీలోని హనుమంతు.. శ్రీఆంజనేయం సినిమాలోని అంజిని కలవడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నితిన్, టీజ సజ్జ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్.. టాలీవుడ్ మల్టీవర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.