Sudheer Babu: పరశురామ్‌గా మరో లుక్‌ను పట్టుకొస్తున్న సుధీర్ బాబు.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఎంచుకునే పాత్రలు ఆయనకు మంచి పేరును తీసుకొస్తాయని అభిమానులు అంటుంటారు. ఇక ఆయన చేసే సినిమాలు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండాలని ఆయన చూస్తుంటాడు. ఈ క్రమంలోనే వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాడు ఈ హీరో.

Sudheer Babu: పరశురామ్‌గా మరో లుక్‌ను పట్టుకొస్తున్న సుధీర్ బాబు.. ఎప్పుడంటే..?

From Maama Mascheendra To Be Out Tomorrow

Updated On : March 3, 2023 / 7:44 PM IST

Sudheer Babu: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఎంచుకునే పాత్రలు ఆయనకు మంచి పేరును తీసుకొస్తాయని అభిమానులు అంటుంటారు. ఇక ఆయన చేసే సినిమాలు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండాలని ఆయన చూస్తుంటాడు. ఈ క్రమంలోనే వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాడు ఈ హీరో.

Sudheer Babu : సుధీర్ బాబు కెరీర్‌లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా?

ఇక తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘మామా మశ్చీంద్ర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా ట్రిపుల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రల్లో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాత్రగా ‘దుర్గ’ అనే క్యారెక్టర్‌ను ఇటీవల ఇంట్రొడ్యూస్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాత్రలో సుధీర్ బాబు ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా లావుగా కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

Sudheer Babu : కొత్త సినిమాలో సుధీర్ బాబు లుక్ చూస్తే షాక్ అవుతారు.. వీడియో లీక్!

కాగా, తాజాగా ఈ సినిమాలోని రెండో పాత్రగా పరశురామ్ అనే క్యారెక్టర్‌ను రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని పరశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 11.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాను నటుడు కమ్ డైరెక్టర్ హర్షవర్ధన్ తెరకెక్కిస్తుండగా ఈషా రెబ్బా, మిర్నాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.