Sujeeth : మెగాస్టార్ కి నో చెప్పి.. పవర్ స్టార్ కి హిట్ ఇచ్చిన సుజీత్.. ఈ విషయం తెలుసా?

సినిమా ఈ రేంజ్ హైప్, హిట్ రావడానికి కారణం డైరెక్టర్ సుజీత్ అని నిర్మొహమాటంగా అభిమానులే చెప్తున్నారు. (Sujeeth)

Sujeeth : మెగాస్టార్ కి నో చెప్పి.. పవర్ స్టార్ కి హిట్ ఇచ్చిన సుజీత్.. ఈ విషయం తెలుసా?

Sujeeth

Updated On : September 25, 2025 / 12:43 PM IST

Sujeeth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ సినిమా చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ ప్రజెన్స్ కి, స్టైలిష్ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా ఈ రేంజ్ హైప్, హిట్ రావడానికి కారణం డైరెక్టర్ సుజీత్ అని నిర్మొహమాటంగా అభిమానులే చెప్తున్నారు. అయితే సుజీత్ గతంలో మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ వస్తే నో చెప్పాడని తెలుసా?(Sujeeth)

సుజీత్ సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమాలు ట్రై చేసాడు. ఓ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో గెలిచి యువీ క్రియేషన్స్ కళ్ళల్లో పడ్డాడు. దాంతో మొదటి సినిమా రన్ రాజా రన్ తీసి మంచి విజయం సాధించాడు. ఇక సెకండ్ సినిమా ఏకంగా బాహుబలి తర్వాత ప్రభాస్ తో సాహో హాలీవుడ్ రేంజ్ లో తీసి అదరగొట్టాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని పవర్ స్టార్ తో OG సినిమా తీసి హిట్ కొట్టాడు.

Also Read : Tollywood : ‘పవర్ స్టార్’ మానియా ఇది.. రాత్రి నుంచే డ్యూటీ చేస్తున్న మొత్తం టాలీవుడ్.. నీల్, సందీప్ రెడ్డి, నాని, నాగ్ అశ్విన్, తేజ్..

అయితే ఈ మధ్యలో సుజీత్ కొన్నాళ్ళు బాలీవుడ్ లో ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని డైరెక్ట్ చేయమని ఛాన్స్ వచ్చింది. అయితే రీమేక్ సినిమా చేయను అని మెగాస్టార్ అయినా ఆ సినిమా ఛాన్స్ కి నో చెప్పాడు సుజీత్. అప్పుడు మెగాస్టార్ కి నో చెప్పి ఇప్పుడు తమ్ముడు పవర్ స్టార్ తో OG తీసి సక్సెస్ కొట్టాడు.

అయితే మొదట పవన్ కళ్యాణ్ తో సినిమా అని త్రివిక్రమ్ పిలిచినప్పుడు రీమేక్ చేయమని అడిగారట. కానీ సుజీత్ ఒరిజినల్ కథ ఒకటి ఉందని పవన్ కి చెప్పడం, పవన కి నచ్చడంతో OG పట్టాలెక్కింది. మొత్తానికి మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు సుజీత్. మరి ఫ్యూచర్ లో చిరంజీవితో డైరెక్ట్ సినిమా చేస్తాడేమో చూడాలి.

Also Read : Sujeeth : సుజీత్ కి గుడి కట్టినా తప్పు లేదు.. ఫుల్ హ్యాపీలో పవన్ ఫ్యాన్స్..