Sukumar : అవకాశం వస్తే సినిమాలు చెయ్యడం మానేస్తా.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

Sukumar : అవకాశం వస్తే సినిమాలు చెయ్యడం మానేస్తా.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..

Updated On : December 24, 2024 / 12:46 PM IST

Game Changer USA Pre-release Event : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా ఉంది. కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ అంజలి కూడా నటిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్.

అయితే  గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ వచ్చారు. కాగా ఈ ఈవెంట్ లో సుకుమార్ చేసిన పలు వ్యాఖ్యలు విని అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ సుమ మాట్లాడుతూ.. “దోప్ అనే పదంతో ఒకటి వదిలెయ్యాలి అంటే ఏం వదిలేస్తారు అని సుకుమార్ ను అడిగింది..

Also Read : Vijay-Rashmika : మళ్ళీ ఒకే చోట విజయ్ దేవరకొండ, రష్మిక.. ఆ సెలబ్రేషన్స్ కోసమేనా..?

దానికి సుకుమార్ సమాధానమిస్తూ.. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సినిమాలు మానేస్తాను అని చెప్పాడు”. ఇంత పెద్ద విషయాన్ని సుకుమార్ అంత సింపుల్ గా, అంత మంది ముందు చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. రామ్ చరణ్ సైతం షాక్ అయ్యాడు. మరి సుకుమార్ ఎందుకు ఇలా అన్నాడో తెలీదు కానీ. పుష్ప 2 సినిమా వివాదం వల్లే ఆయన ఈ విధంగా అన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.