Abhishek Ambareesh : సుమలత కుమారుడి రిసెప్షన్ విందు.. భోజనాల కోసం తోపులాట.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..

తాజాగా జూన్ 16న అభిషేక్, అవివా రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. సుమలత, అంబరీష్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ ని నిర్వహించారు. తన నియోజకవర్గం అయిన మాండ్యలోని గెజ్జెలగెరె వద్ద 15 ఎకరాల ఓపెన్ ప్లేస్ లో ఈ రిసెప్షన్ ని భారీగా నిర్వహించారు.

Abhishek Ambareesh : సుమలత కుమారుడి రిసెప్షన్ విందు.. భోజనాల కోసం తోపులాట.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..

Sumalatha son Abhishek Ambareesh reception huge fans arrived for meals police did lathi charge

Updated On : June 17, 2023 / 3:51 PM IST

Abhishek Ambareesh Reception : సీనియర్ నటి సుమలత(Sumalatha) సౌత్ టు నార్త్ పలు భాషల్లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి అలరించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో(Politics) ఎంపీగా ప్రజలకు సేవ చేస్తున్నారు. సుమలత భర్త, ఒకప్పటి స్టార్ హీరో అంబరీష్(Ambareesh) మరణించాక పూర్తిగా కుటుంబం, రాజకీయాల్లోనే నిమగ్నమైపోయారు. ఇటీవలే సుమలత తనయుడు అభిషేక్ అంబరీష్ వివాహం ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కూతురు అవివా(Aviva)తో జూన్ 5న జరిగింది. ఈ వివాహానికి అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు విచ్చేశారు.

తాజాగా జూన్ 16న అభిషేక్, అవివా రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. సుమలత, అంబరీష్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ ని నిర్వహించారు. తన నియోజకవర్గం అయిన మాండ్యలోని గెజ్జెలగెరె వద్ద 15 ఎకరాల ఓపెన్ ప్లేస్ లో ఈ రిసెప్షన్ ని భారీగా నిర్వహించారు. వేలమంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులు వేలల్లో వస్తుండటంతో భోజనాలు కూడా కొన్ని వేల మందికి ప్రిపేర్ చేశారు.

Sumalatha : సుమలత కొడుకు పెళ్ళిలో పాన్ ఇండియా స్టార్స్ రజనీకాంత్‌, యశ్.. ఫోటోలు!

అయితే మధ్యాహ్నం భోజనం సమయానికి ఒక్కసారిగా జనాలు భోజనాల దగ్గరికి రావడంతో తోపులాట జరిగింది. సరిగ్గా మెయింటైన్స్ లేకపోవడంతో భోజనాల కోసం ఎగబడ్డారు జనాలు. దీంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు జనాల్ని నియంత్రించడానికి తమ లాఠీలకు పని చెప్పారు. ఈ లాఠీచార్జి లో దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. దీంతో ఈ వార్త కర్ణాటకలో చర్చగా మారింది.