Sunil- Ajith : అజిత్ సర్ నాకు కాల్ చేసి.. పొద్దున్నే నాలుగింటికి వచ్చేసారు..

సునీల్ అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

Sunil- Ajith : అజిత్ సర్ నాకు కాల్ చేసి.. పొద్దున్నే నాలుగింటికి వచ్చేసారు..

Sunil Tells Interesting thing about Tamil Star Hero Ajith Kumar

Updated On : April 15, 2025 / 3:24 PM IST

Sunil- Ajith : మన సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు బయట తిరగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫోటోలు, సెల్ఫీలు అని జనాలు హడావిడి చేస్తారని పబ్లిక్ ప్లేసెస్ అవాయిడ్ చేస్తారు కానీ వాళ్లకు కూడా తిరగాలని ఉంటుంది. తాజాగా తమిళ్ స్టార్ అజిత్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు సునీల్.

అజిత్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సునీల్ అజిత్ పక్కనే ఉండే కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు తమిళ్ లో ప్రమోషన్స్ చేయగా సునీల్ అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Nag Ashwin : ఆ సినిమా ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన స్టార్ డైరెక్టర్.. సినిమా పెద్ద హిట్..

సునీల్ మాట్లాడుతూ.. షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది. అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు అజిత్ సర్ నాకు కాల్ చేసి హైదరాబాద్ KBR పార్క్ లో రేపు నేను కూడా నీతో పాటు జాగింగ్ లో జాయిన్ అవుతాను అన్నారు. నెక్స్ట్ డే పొద్దున్నే నాలుగింటికి వచ్చేసారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా వచ్చారు. మేమిద్దరం కలిసి జాగింగ్ మొదలుపెట్టాం. 3 కిలోమీటర్లు అనుకున్నాం 9 కిలోమీటర్లు జాగింగ్ చేసి వెళ్ళాం అని తెలిపాడు.

దీంతో స్టార్ హీరో అజిత్ హైదరాబాద్ లో షూట్ జరిగినప్పుడు సైలెంట్ గా వచ్చి ఇలా KBR పార్క్ లో సైలెంట్ గా జాగింగ్ చేసి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. గతంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా సైలెంట్ గా హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : Pawan Kalyan : మూగ జీవాల కోసం పవన్ కళ్యాణ్ మంచిపని.. రాష్ట్ర వ్యాప్తంగా..