Vyooham : అక్కినేని వారసురాలి ‘వ్యూహం’.. క్రైమ్ థ్రిల్లర్‌తో కొత్త సీరీస్.. ట్రైలర్ చూశారా..
అక్కినేని వారసురాలు.. నటి మరియు నిర్మాత సుప్రియా యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'వ్యూహం' అనే క్రైమ్ థ్రిల్లర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

Supriya Yarlagadda Vyooham web series trailer released
Vyooham : ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ లో వెబ్ సిరీస్ కి ప్రేక్షాధారణ పెరుగుతూ పోతుంది. దీంతో తెలుగులో కూడా ఒరిజినల్ కంటెంట్ తో వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. టాలీవుడ్ నిర్మాతలు అటు వెండితెర సినిమాలను నిర్మిస్తూనే, ఇటు ఓటీటీ కంటెంట్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే అక్కినేని వారసురాలు.. నటి మరియు నిర్మాత సుప్రియా యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ‘వ్యూహం’ అనే క్రైమ్ థ్రిల్లర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఈనగరానికి ఏమైంది’ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి సుశాంత్ రెడ్డి.. పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్రలో ఈ సిరీస్ తెరకెక్కుతుంది. చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ సిద్దంశెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. నేడు ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒక యాక్సిడెంట్ లో ప్రాణం కోల్పోయిన గర్భిణీ నుంచి ఈ కథ మొదలవుతుంది. ఆ కేసు ద్వారా సీరియల్ కిల్లర్, నక్సల్, టెర్రరిస్ట్ యాక్టివిటీ.. ఇలా ఒక్కొకటి బయటకి వస్తుంటుంది. ఫైనల్ గా హీరో సాయి సుశాంత్ గతానికి కూడా కథ కనెక్ట్ అవుతుంది.
Also read : Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు
ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. డిసెంబరు 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ అవ్వనుంది. ఈ సిరీస్ ఆడియన్స్ ని తప్పకుండ ఆకట్టుకుంటుందని నిర్మాత సుప్రియా పేర్కొన్నారు.